గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ మూవీ మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే వదిలిన పోస్టర్స్, ‘జరగండి జరగండి..’ సాంగ్, వస్తోన్న అప్డేట్లతో గేమ్ ఛేంజర్‌పై మరింత హైప్ ఏర్పడింది. క్రిస్మస్ సందర్భంగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు.
ఈ ఏడాది క్రిస్మస్ కి గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం అని చెప్పడమే కాదు, ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ లో పండగ వాతావరణాన్ని తీసుకొస్తున్నారు నిర్మాతలు. తాజాగా గేమ్ ఛేంజర్ డబ్బింగ్ పనులు షురూ అయ్యాయి. పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఆల్ సెట్ ఫర్ ద మెగా ఫైర్ వర్క్స్ – క్రిస్మస్ 2024 అంటూ డబ్బింగ్ ప్రారంభించిన విషయాన్ని పంచుకున్నారు మేకర్స్.
వినయ విధేయ రామ చిత్రంలో జోడీగా మెప్పించిన రామ్ చరణ్, కియారా అద్వానీ.. గేమ్ ఛేంజర్‌లో అలరించటానికి రెడీ అయ్యారు. ఈ క్యూట్ పెయిర్ సందడిని సిల్వర్ స్క్రీన్‌పై చూడాలనే ఉత్సాహం అందరిలోనూ కనిపిస్తోంది. ఇయర్ ఎండింగ్‌లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ టు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ మావే అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది గేమ్ ఛేంజర్ యూనిట్ లో.
ఆమధ్య గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేసేశారు. డైరెక్టర్ శంకర్ మిగిలిన చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. లార్జర్ దేన్ లైఫ్ చిత్రాలను అబ్బురపరిచే రీతిలో తెరకెక్కించే శంకర్ ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాలను మించేలా ‘గేమ్ ఛేంజర్’ను రూపొందిస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమ ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఫ్యాన్సీ ప్రైజ్‌కి దక్కించుకుంది.
Movie : Game Changer
Cast : Ram Charan, Kiara Advani, Anjali, Samuthirakhani, SJ.Suryah, Srikanth, Sunil, Naveen Chandra and others
Technicians :
Director: Shankar Shanmugam
Producers: Dil Raju, Sirish
Writers: SU.Venkatesan, Vivek
Storyline: Karthik Subbaraj
Co-Producer: Harshit
Cinematography: S.Thirunavukkarasu
Music: S.Thaman
Dialogues: Sai Madhav Burra
Line Producers: Narasimha Rao. N, SK.Jabeer
Art Director: Avinash Kolla
Action Choreogrpaher: Anbariv
Dance Choreographer: Prabhu Deva, Ganesh Acharya, Prem Rakshit, Bosco Martis, Jhony, Sandy
Lyricists: Ramajogaiah Sastry, Ananta Sriram, Kasarla Shyam
Banner: Sri Venkateswara Creations
PRO: Naidu Surendra Kumar, Phani (Beyond Media)
Digital Media: Nani