రామ్ గోపాల్ వర్మ… ఈ పేరంటేనే సంచలనం. మాటలకు మేకప్ వేసి అందంగా ప్రెజెంట్ చేయడం ఆయనకు తెలీదు, రాదు. మనసులో ఏదైతే వుంటుందో దాన్ని పైకి చెప్పేస్తారు. ఆయన ఒక ట్వీటు ట్వీటితే అందరూ ఉలిక్కి పడాల్సిందే. ఒక ఇంటర్వ్యూ ఇచ్చారంటే ఒక్కో మాటా ఒక్కో పవర్ ఫుల్ ఆయుధమై ఎందరికో గుచ్చుకుంటాయి. అయినా, అంతా నా ఇష్టం అన్నట్టుగా బతకడం ఒక్క ఆయనకే సాధ్యం. ఆవేశపడకపోవడం, ఎంతటి సంచలనమైన కామెంట్ అయినా కూల్ గా చేయడం రామ్ గోపాల్ వర్మకు ట్వీటుతో పెట్టిన విద్య.
అయితే, ఇటీవల ఆయనిచ్చిన ఒక ఇంటర్వ్యూలో ‘ఆర్.ఆర్.ఆర్.’ సినిమా ప్రస్తావన వచ్చింది. ఆ సినిమా చూస్తూంటే తనకు జెమినీ సర్కస్ లా అనిపించిందన్నారు రామ్ గోపాల్ వర్మ. మళ్లీ… తనకలా అనిపించిందనీ, ఏమీ అనుకోవద్దనీ అన్నారు. ముఖ్యంగా ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ కుర్రాడిని కాపాడిన సీన్ అచ్చు జెమినీ సర్కస్ లానే అనిపించిందని అన్నారు. ఈ మాటలకు రాజమౌళి ఎలా రియాక్టవుతారో వేచి చూడాల్సిందే…!!