Ramappa Temple, UNESCO World Heritage Site, The Glorious Kakatiya Temple, Telangana CM KCR, Koppula Eshwar, Bhakthi News, Telugu Wolrd News,
BHAKTHI NEWS: రామప్ప గుడికి “యునెస్కో” గుర్తింపు లభించడం హర్షనీయం: ముఖ్యమంత్రి కెసిఆర్
అద్భుతమైన శిల్పకళకు నెలువైన రామప్ప ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. దీంతో ముఖ్యమంత్రి కెసిఆర్, తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ విషయం అని సీఎం కెసిఆర్ అన్నారు ,
తెలంగాణ రాష్ట్ర పేరు ప్రఖ్యాతలు మరోసారి ప్రపంచం ముందు ఆవిష్కృతం అయ్యాయని ఒక ప్రకటనలో మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రజల చిరకాల వాంఛ అయిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మహోద్యమాన్ని నడిపిన కెసిఆర్.. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేస్తున్నారని కొప్పుల అన్నారు. కెసిఆర్ ఆలోచనలు, దూరదృష్టి, పక్కా ప్రణాళికతో జల, విద్యుత్, హరిత,శ్వేత, నీలి, గులాబీ, పారిశ్రామిక విప్లవాలు వచ్చాయని, ఇక పర్యాటక విప్లవం కూడా రానున్నదని తెలంగాణలో పర్యాటకం మరింత వర్థిల్లనుంది అని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.