Movie రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన బ్రహ్మస్త్ర మూవీ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.. ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్స్ సాధిస్తున్నా.. ఈ మూవీ పై నెగిటివ్ టాక్ మాత్రం ఆగటం లేదు. అయితే ఈ సినిమానే కాకుండా అలియా భట్ ను కూడా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అలియా భట్ గర్భవతిగా ఉన్నప్పటికీ ఈ సినిమా కోసం ఎంతో కష్టపెట్టారని.. ఆమెకు రెస్ట్ ఇవ్వాల్సింది పోయి సినిమా ప్రమోషన్స్ కోసం ఇబ్బంది పెడుతున్నారని.. రణబీర్ కపూర్ మీద కూడా విమర్శలు వస్తున్నాయి. అయితే వీటన్నిటికీ రణబీర్ కపూర్ తనదైన రీతిలో సమాధానం చెప్పాడు.
బ్రహ్మాస్త్ర మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రణబీర్ కపూర్ అలియా భట్ పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. కలెక్షన్స్ కోసం.. సినిమా ప్రమోషన్స్ కోసం.. ఆలియా భట్ ను ఈ సమయంలో ఇంత ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని రణబీర్ ను ట్రోల్ చేస్తున్నారు. అయితే వీటిపై స్పందించిన రణబీర్.. అలియా భట్ భారతదేశంలో ఉన్న అత్యుత్తమ నటీమణులలో ఒకరని అనటంలో ఏమాత్రం సందేహం లేదన్నాడు.. బ్రహ్మాస్త్రం మూవీ ఇంత గ్రాండ్ సక్సెస్ అవటానికి కారణం అలియా భట్ కృషి అని పొగడ్తలతో ముంచెత్తాడు.. సమయంలో కూడా ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా ఎంతో కష్టపడిందని.. తనలో ఉన్న ఈ ఎనర్జీని ఇంకే నటిలో చూడలేదని అన్నాడు. తన భార్యను ట్రోల్ చేసే వాళ్ళందరికీ తన భార్య అంటే అసూయ అని.. ఏ విషయాన్ని ఎలా మేనేజ్ చేయాలో ఆలియా కన్నా ఎవరికీ బాగా తెలియదని చెప్పుకొచ్చాడు. ఆలియా నా భార్య మాత్రమే కాదు.. గొప్ప నటి అని.. అంతేకాకుండా అలియా భట్ రూపంలో నాకు భార్య మాత్రమే కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమ మేనేజర్ దొరికిందని అన్నారు.

























