Crime జార్ఘండ్‌లో ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన వెలుగు చూసింది. తన స్నేహితుల ముందు ఆ బాలిక తననే ప్రేమిస్తుందని నిరూపించుకునేందుకు… ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా… వీడియో తీసి స్నేహితులకు చూపించాడు. ఈ వీడియో నెట్ లో వైరల్ గా మారి బాలిక బంధువులకు చేరడంతో వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. యువకుడి పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఘటన వెలుగులోకి రావడంతో పోలీసు కేసు నమోదైంది.
జార్ఘండ్‌లోని కోయలంచన్ ధన్‌బాద్ ప్రాంతానికి చెందిన కొందరు యువకులు… అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక విషయమైన వాగ్వాదం జరిగింది. ఆ యువకులలో ఒకరు.. ఆమె తననే ప్రేమిస్తుందని చెప్పాడు. దాంతో.. సంజయ్ మరొక యువకుడు తననే ప్రేమిస్తుందని గొడవకు దిగాడు. కావాలంటే ఆధారాలు సైతం నిరూపిస్తానంటూ సవాలు విసిరాడు. ఆ తర్వాతి రోజే… మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి…. తనతో తీసుకెళ్లిన సంజయ్… దగ్గర్లోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ ఘాతుకాన్ని తన ఫోన్లో చిత్రీకరించాడు. ఆమె తనను ప్రేమిస్తుంది కాబట్టే… తనతో కలిసిందంటూ… వీడియోను స్నేహితులకు పంపించాడు. దాంతో.. ఆ వీడియో కాస్త బాలిక బంధువులకు చేరింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు… బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ… పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు… సంజయ్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.