Ravanasura Movie : మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదున్నారు. ఇప్పుడు ఆయన ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాల సక్సెస్ తో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా… రవితేజ ఆర్ టి టీమ్‌వర్క్స్, అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతోంది.
సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ మూవీలో ఐదుగురు హీరోయిన్లు గా నటిస్తుండడం ప్రత్యేక ఆకర్షణ సంతరించుకుంది. తాజాగా రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రావణసుర గ్లింప్స్ విడుదల చేశారు.
తాజాగా విడుదలైన గ్లింప్స్ ఆసక్తికరంగా ఉందనే చెప్పాలి. ఈ విజువల్స్ చూస్తుంటే సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఓ డార్క్ థీమ్ లో రవితేజ యాటిట్యూడ్.. తన లుక్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇక చివరగా.. టైటిల్ కు తగినట్టుగానే పగిలిన గ్లాస్ లో రవితేజని పలు ముఖాల్లో చూపించారు. ఈ సినిమాలో రవితేజను లాయర్ పాత్రలో కనిపించనున్నారు.
#Ravanasura – The Glimpse 😎https://t.co/H9cmkPW2lU
This is going to be a special one 🤗 pic.twitter.com/QQH4zGZE87
— Ravi Teja (@RaviTeja_offl) January 26, 2023
శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి సరికొత్త కథని అందించారు. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో ఈ చిత్రాన్ని కథనంలో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఏప్రిల్ 7, 2023న సమ్మర్ లో ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ సినిమాతో కూడా హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని రవితేజ ప్లాన్ చేస్తున్నారు.