ప్రముఖ సినీనటుడు కృష్ణం రాజు (83) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో ఏఐజీ వేకువజామున 3.25 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో సినీరంగంలో తీవ్ర విషాదం నెలకొంది.
సినీప్రముఖుల నివాళి..
కృష్ణం రాజు భౌతికకాయం ఇంటికి చేరుకుంది. దీంతో ఆయన్ను కడసారి చూసేందుకు ఇండస్ట్రీలో ప్రముఖులు, అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. కృష్ణం రాజు భౌతికకాయం చూసి ఆయన సతీమణి శ్యామలాదేవి కన్నీరుమున్నీరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సినీ ప్రముఖులు చిరంజీవి, మోహన్‌బాబు, మహేశ్‌బాబు, మురళీమోహన్, త్రివిక్రమ్, రాజు సుందరం, రాఘవేంద్రరావు తదితరులు భౌతికకాయానికి నివాళులు అర్పించారు.