Entertainment తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడంలో ఒక్కొక్కరు ఒక్కో దారిని ఎంచుకుంటారు. అయితే ఏది ఏమైనా సినిమాకు కావాల్సినంత బజ్ తీసుకురావడానికి నటీనటులు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఇదే దారిలో వెళ్తుంది టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా.. రెజీనా ప్రస్తుతం నివేదా థామస్ తో కలిసి “శాకిని డాకిని” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలోకి రానుంది.
ప్రస్తుతం రెజీనా నివేదా థామస్ తో కలిసి “శాకిని డాకిని” నటించిన “శాకిని డాకిని” మూవీలో నటించింది. ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న రెజీనా.. ‘శాకిని డాకిని’ కి మంచి బజ్ తీసుకురావడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పడమే కాకుండా లిప్ లాక్ అనుభవాల గురించి మాట్లాడుతోంది. మొన్న రెజీనా వేసిన 2 మినిట్స్ అడల్ట్ జోక్ ఎంత వైరల్ గా మారిందో తెలిసిందే. ‘అబ్బాయిలు – మ్యాగీ రెండూ ఒకటే. ఎందుకంటే రెండూ రెండు నిమిషాల్లో అయిపోతాయి’ అంటూ రెజీనా అనటంతో నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పుడు లేటెస్టుగా మరో ఇంటర్వ్యూలో రెజీనా ఒక మహిళతో తన లిప్ లాక్ అనుభవం గురించి చెప్పుకొచ్చింది. ఓ సారి ఓ మహిళ తన వద్దకు వచ్చి తన పెదాలను ముద్దాదిందని.. మొదట్లో సర్ప్రైజ్ అయినా.. మహిళే కదా అని అభ్యంతరం చెప్పలేదని అనడంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. అయితే సినిమా ప్రమోషన్స్ చూసిన ఒక్కొక్కరు ఒక్కో రకంగా కామెంట్స్ చేస్తున్నారు. పాపం సినిమా ప్రమోషన్ కోసం రెజీనా గట్టిగానే కష్టపడుతుంది.. మరి ఏమవుతుందో చూడాలి అంటున్నారు..

























