Entertainment నటి, దర్శకురాలు రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘బద్రి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈమె ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2012లో పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకున్న రేణు.. అప్పటి నుంచి సింగిల్‌గానే ఉంటోంది. అయితే గతంలో రేణు దేశాయ్ రెండో పెళ్లిపై వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.
జీవితంలో ఒక తోడు అవసరం అని ఆమె స్వయంగా కొన్ని ఇంటర్వ్యూలో పేర్కొంది. పవన్‌తో విడాకుల అనంతరం రేణు తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణేలో తన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈ క్రమంలోనే రెండో పెళ్లికి సిద్ధమైన రేణు దేశాయ్‌కు 2018లో ఓ వ్యక్తితో నిశ్చితార్థం కూడా జరిగింది. రేణు దేశాయ్ పాల్గొన్న షోలో రేణుక కాబోయే రెండో భర్త ఓ వాయిస్ ఓవర్ కూడా పంపించాడు. తన జీవితం ఎంతో సంతోషంగా ఉండటానికి కారణం అంటూ ఆమెను మెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత అతనితో పెళ్లిపై ఇంతవరకు క్లారిటీ లేదు. పెళ్లి జరిగిందా లేదా అన్న విషయంపై ఇప్పటివరకు ఎవరికి కూడా క్లారిటీ రాలేదు.