Crime తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు లోయలో పడడంతో ఓ మహిళ మృతి చెందగా పదిమంది తీవ్ర గాయాలు పాలయ్యారు..
రోడ్డు ప్రమాదాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి జాగ్రత్తగా ఉండాలంటూ ఎంతగా హెచ్చరిస్తున్నా ఎక్కడ ఒక దగ్గర ఏదో ఒక ప్రమాదం నిత్యం జరుగుతూనే ఉంటుంది.. ముఖ్యంగా లోయల్లో వెళ్తున్న బస్సులు అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరమని చెబుతున్న ప్రమాదాలు జరుగుతున్నాయి.. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది..
వికారాబాద్ జిల్లాలో ఓ బస్సు లోయలో పడడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది బ్రేకులు ఫెయిల్ అవ్వటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది వికారాబాద్ డిపోకు చెందిన ఓ పల్లె వెలుగు బస్సు తాండూరు నుంచి వికారాబాద్ కు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. అనంతగిరి గుట్ట సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.. అయితే ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా పదిమంది తీవ్ర గాయాల పాలయ్యారు.. అయితే ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియనప్పటికీ డ్రైవర్ జాగ్రత్త వలన ఈ ప్రమాదం జరిగిందా లేక నిజంగానే బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వటం వల్ల ఇలా జరిగిందా అనే విషయం దర్యాప్తులో తేలనుంది..