Movie News: సినీ తారలు తమ హవా జరిగే వరకు సినిమా ఇండస్ట్రీలో మారు మ్రోగుతారు ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెడతారు. సినీ తారలు రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీగానే చెప్పుకోవచ్చు. అయితే అదే బాటలో త్రిష కూడా ఫాలో అవుతున్నారని సోషల్ మీడియాలో కథనాలు అధికంగా వస్తున్నాయి.త్రిష ఓ జాతీయ పార్టీలో చేరనుందని ఆమెకు ఓ స్టార్ హీరో ఆమెకు సహకరిస్తున్నారంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి వాటిపై త్రిష తల్లి ఫైర్ అవుతున్నారు.
వైరల్ అవుతున్న వార్త ఏమిటంటే త్రిష కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతుందంటూ టాక్ వచ్చింది. ప్రముఖ నటుడు తలపతి విజయ్ త్రిష రాజకీయాల్లోకి వెళ్లేందుకు సహాయం చేస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త విన్న త్రిష అభిమానులు షాక్ అవ్వడం జరుగుతుంది. త్రిష రాజకీయాలకు వెళ్లడం ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు. అందులోనూ తలపతి త్రిషకు సహాయం చేయడం ఏంటి తలపతే రాజకీయాలకు వెళ్ళచ్చు అంటూ త్రిష అభిమానులు వ్యంగ్యంగా మాట్లాడడం జరుగుతుంది.
ఇది అంతా కట్టు కథ అని త్రిష వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.అలనే మరిన్ని సినిమాల్లో నటించేందుకు కొత్త ప్రాజెక్టులను వింటుందని త్రిష తల్లి ఉమా కృష్ణన్ తెలిపారు.ప్రస్తుతం త్రిష మణి రత్నం దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం పొన్నియిన్ సెల్వన్ లో ఓ కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదలకు సిద్ధమవుతుంది. అలానే గర్జన, రోడ్, రంగి, చదురంగ వేట్టై 2 చిత్రాలు నటిస్తున్నారు త్రిష.

























