Movie బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. తన కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ప్రకటించారు. అలానే ఓ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేశారు. మొదట్లో ‘కభీ ఈద్ కభీ దివాళి’ అనే టైటిల్ పెట్టినా.. ప్రస్తుతం ఆ పేరును మార్చారు.. కిసి కా భాయ్ కిసి కా జాన్ టైటిల్‌ను ఖారారు చేశారు. ఈ వీడియోలో భాయ్ సరికొత్త అవతారంలో కనిపించి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇందులో భాయ్ లాంగ్ హెయిర్‌తో ఎడారిలో స్టైల్‌గా నడుచుకుంటూ కనిపించి ఆకట్టుకున్నారు. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్‌గా నిలిచింది. కాగా, ఈ సినిమాలో హీరో వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అనారి సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన వెంకటేష్ .. ఆ తర్వాత తక్‌దీర్ వాలా అనే మరో హిందీ సినిమాలో నటించారు. తర్వాత తెలుగు సినిమాల్లో బిజీ స్టార్‌గా అయిపోవటం వల్ల బాలీవుడ్ వైపు చూడలేదు. మళ్లీ ఇన్నేళ్ళకు వెంకటేష్ హిందీలో నటిస్తున్నాడు…
#KisiKaBhaiKisiKiJaan@VenkyMama @hegdepooja @TheRaghav_Juyal @siddnigam_off @jassiegill @ishehnaaz_gill @palaktiwarii @farhad_samji @ShamiraahN @RaviBasrur @SKFilmsOfficial pic.twitter.com/odwrPWmlXN
— Salman Khan (@BeingSalmanKhan) September 5, 2022
కాగా, సల్మాన్ ఖాన్ సరసన పూజాహెగ్డే నటిస్తున్న తొలి సినిమా ఇది. ఇటీవలే కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక ఈ సినిమాకు తొలుత కభీ ఈద్ కభీ దివాళీ అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఇప్పుడు కొత్త టైటిల్‌ను అనౌన్స్ చేసి సర్‌ప్రైజ్ చేశారు. ఈ ఏడాది చివర్లో చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. భాయ్.. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ నటిస్తున్నారు.

























