మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ ఇటీవల రిలీజై మంచి టాక్ దక్కించుకుంది. దీంతో చిరు ఇన్‌స్టా వేదికగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో ఓ ఇంటర్వూ నిర్వహించారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు చిరంజీవి.
గాడ్‌ఫాదర్ మూవీ కోసం దర్శకుడు పూరీ, చిరు ఒకర్ని మరొకరు పలు విషయాలు ప్రశ్నించుకున్నారు. మెగాస్టార్‌కు సినిమా ఎంపికలో కథే ప్రాధాన్యం అని చెప్పారు. పాటలు, ఫైట్లు సెకండరీ అని చెప్పారు. ఇక సల్మాన్ గురించి చెప్తూ.. చిరు మొదటి సారి బ్యాంకాక్‌లో ఓ యాడ్ షూటింగ్ కోసం కలిశారు. తెలుగు వెర్షన్లో చిరు చేస్తే.. హిందీలో సల్మాన్‌ఖాన్ చేశారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని మెగాస్టార్ చెప్పారు. ఇక సల్మాన్‌కైతే రామ్ చరణ్ అంటే చాలా ఇష్టమని చిరు చెప్పారు. సల్మాన్ హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి చరణ్‌ను కలుస్తారని తెలిపారు. ఇక రామ్ చరణ్ కూడా సల్మాన్ ఇచ్చిన జాకెట్‌ను భద్రంగా దాచుకున్నాడు. వాదిద్దరి మీద అభిమానంతో సల్మాన్ గాడ్‌ఫాదర్ మూవీకోసం రెమ్మునరేషన్ తీసుకోలేదని చిరు చెప్పారు.