Movie బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఒక్క సినిమాకు రూ.100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఆయన మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా కోసం తెలుగులో నటించడానికి సిద్ధం అయ్యాడు. త్వరలోనే విడుదలకు సిద్దం అవుతున్న ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ తీసుకున్న పారితోషికం వైరల్ గా మారింది.
మోహన్ రాజా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్ అన్నీ కూడా ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఇకపోతే సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్న కీలక పాత్ర కోసం ఏకంగా రూ. 40 కోట్ల వరకు అందుకున్నాడు అని సమాచారం. అయితే నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.. ప్రస్తుతం ఈ సినిమా తెలుగుతోపాటు హిందీలో కూడా రిలీజ్ చేయనున్నారు. కాబట్టి అక్కడ కూడా ఈ సినిమా మంచి మార్కెట్ ను క్రియేట్ చేస్తుందని కూడా మేకర్స్ భావిస్తున్నారు. ఇందులో సత్యదేవ్, నయనతార, సునీల్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
సల్మాన్ ఖాన్, చిరంజీవి కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. మరి ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమాను తెరకెక్కిస్తారా లేదా అనేది చూడాలి. మరి దసరా కానుకగా గాడ్ ఫాదర్ సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు సన్నహాలు కూడా సిద్ధం చేస్తున్నారు.

























