Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత(Samantha) ఒకరు. అనారోగ్యం కారణంగా కొంతకాలం షూటింగ్స్‌కు దూరంగా ఉన్న సామ్ ప్రస్తుతం పుల్ బిజీగా ఉంది. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) సరసన ఖుషి (Kushi) సినిమాలో నటిస్తోంది. వరుణ్ ధావన్(Varun Dhawan))తో కలిసి సిటాడెల్(Citadel) అనే వెబ్ సిరీస్ షూటింగ్‌లోనూ పాల్గొంటుంది. కాగా.. షూటింగ్స్‌తో బిజీగా ఉండే సామ్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలతో పాటు షూటింగ్స్‌కు సంబంధించిన విషయాలను సైతం అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.
ఇక తాజాగా సింగర్ చిన్మయి(Chinmayi ) భర్త, తనకు బెస్ట్ ఫ్రెండ్ అయిన రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘మీకు తెలిసిన మంచి వ్యక్తిని తీసుకుని వందసార్లు గుణిస్తే అదే నా బెస్ట్ ఫ్రెండ్ రాహుల్. నేను నిన్ను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను.’ అంటూ సామ్ చెప్పుకొచ్చింది. రాహుల్ పుడ్‌ను ఆస్వాదిస్తున్న ఫోటోను షేర్ చేసింది.
తను మంచి పుడీ అయినప్పటికీ మీతో కంపెనీ ఇవ్వడానికి దాన్ని కూడా వదులుకుంటాడు. అయితే.. అందుకు అతడు చాలా బాధపడుతాడు అంటూ రాసుకొచ్చింది సమంత. ఫోటో వైరల్‌గా మారగా దానిపై రాహుల్ రవీంద్రన్ రిప్లై ఇచ్చాడు. ‘పాపా… ఇప్పుడు నన్ను ఏడిపించాలని చూస్తున్నావా..? లవ్యూ లాడ్స్ ‘అంటూ బదులు ఇచ్చాడు.
కాగా.. సమంత కెరీర్ ప్రారంభంలో వీరిద్దరు కలిసి ఓ తమిళ చిత్రంలో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరిద్దరు మంచి స్నేహితులు అయ్యారు. ఇక రాహుల్ భార్య సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి కూడా సమంతకు మంచి స్నేహితురాలు అన్న సంగతి తెలిసిందే. సమంత నటించిన చిత్రాల్లో చాలా వరకు సమంతకు చిన్మయి డబ్బింగ్ చెప్పింది.