Sampoornesh Babu, RK Malineni’s Cauliflower First Look Out, Vasanthi, Posani Krishna Murali, Latest Telugu Movies,
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు,ఆర్కే మలినేనిల ‘క్యాలీఫ్లవర్’ ఫస్ట్ లుక్ విడుదల
‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు. ఇటీవల ఆయన నటించిన ‘కొబ్బరిమట్ట’ చిత్రాన్ని ప్రేక్షకులకు సూపర్‌హిట్ చేశారు. తాజాగా మరో కొత్త క్రేజీ కాన్సెప్ట్‌తో మరోసారి ప్రేక్షకులను ఆలరించడానికి రెడీ అయ్యారు సంపూర్ణేష్ బాబు. ‘క్యాలీ ఫ్లవర్’ అనే సరికొత్త టైటిల్‌తో మనముందుకు రానున్నారు. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. మే 9 సంపూర్ణేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్.
‘క్యాలీఫ్లవర్’ సినిమాలోని సంపూర్ణేష్‌బాబు ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభిస్తుంది. ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చిన వ్యక్తి గెటప్‌లో సంపూ లుక్ అదిరిపోయింది. అలాగే సంపూ మార్క్‌స్టైల్ ఈ ఫస్ట్ లుక్
లో కనిపిస్తుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ బ్యాంగ్ వీడియోలో సంపూ అలరించిన తీరు ‘క్యాలీఫ్లవర్’ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది. మరోసారి సంపూ స్టైల్ ఆఫ్ కామెడీని ‘క్యాలీఫ్లవర్’ చిత్రంతో హాస్య ప్రియులు
ఎంజాయ్ చేయనున్నారని తెలుస్తోంది.
గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని
ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని ఈ సినిమాకు దర్శకులు. ఈ చిత్రంలో సంపూర్ణేష్‌బాబు సరసన వాసంతి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ప్రజ్వల్ క్రిష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ముజీర్ మాలిక్ ఛాయగ్రాహకుడు. ఎడిటింగ్ బాధ్యతలను బాబు నిర్వ హిస్తున్నారు.
నటీనటులు :
సంపూర్ణేష్‌బాబు, వాసంతి, పోసాని కృష్ణమురళి, ఫృధ్వీ, నాగ మహేశ్, గెటప్ శీను, రోహిని, కాదంబరి కిరణ్, కల్లు కృష్ణారావు, విజయ్, కల్యాణీ, సుమన్ మనవ్వాద్, ముస్కాన్, బేబీ సహృద, రమణ్ దీప్
సాంకేతిక నిపుణులు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఆర్కే మలినేని
ప్రొడ్యూసర్: ఆశా జ్యోతి గోగినేని
బ్యానర్స్: మధుసూధన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: కోల నాగేశ్వరరావు, హరిబాబు జెట్టి
సమర్పణ: శ్రీధర్ గుడూరు
స్టోరీ: గోపి కిరణ్
మ్యూజిక్ డైరెక్టర్: ప్రజ్వల్ క్రిష్
డీఓపీ: ముజీర్ మాలిక్
ఎడిటర్:బాబు
డైలాగ్స్: రైటర్ మోహన్, పరమతముని శివరామ్
పీఆర్ఒ: వంశీ–శేఖర్
Cast:
Sampoornesh Babu, Vasanthi, Posani Krishna Murali, Prithvi, Naga Mahesh, Getup Srinu, Rohini, Kadambari Kiran, Kallu Krishna Rao, Vijay, Kalyani, Suman Manvad, Muskaan, Baby Sahruda, Raman Deep
Technical Crew:
Screenplay, Direction: RK Malineni
Producer: Asha Jyothi Gogineni
Banners: Madhusudhana Creations and Radhakrishna Talkies
Executive Producers: Kola Nageswara Rao, Haribabu Jetti
Presents: Sridhar Guduru
Story: Gopi Kiran
Music Director: Prajwal Krish
DOP: Muzeer Malik
Editor: Babu
Dialogues: Writer Mohan, Paramathmuni Sivaram
PRO: Vamsi-Shekar
https://fb.watch/5nUNTNY_1q/