గచ్చిబౌలి, ఆగస్టు 2023 : దక్షిణ కొరియా ఆధారిత బహుళజాతి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ సంస్ధ శ్యాంసంగ్ తెలంగాణలోని హైదరాబాద్ మార్కెట్ లో జెడ్ ప్లిప్, 5, జెడ్ ఫోల్డ్ 5 మోడల్ మొబైల్ ఫోన్స్ ను విడుదల చేసింది. గచ్చిబౌలి లోని సెల్ బే స్టోర్ వేదికగా టాలీవుడ్ నటి వర్షిని సుందరరాజన్ శుక్రవారం నాడు సెల్ బే సంస్ధ మేనేజింగ్ డైరెక్టర్ సోమ నాగరాజు, శ్యాంసంగ్ దక్షిణాది రీజనల్ సేల్స్ మేనేజర్ సుమిత్ కుక్రెజ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతినిధుల సమక్షంలో మొబైల్ ఫోన్ లను విడుదల చేసింది.
ఈ సందర్భంగా వర్షిణి మాట్లాడుతూ… మారుతున్న టెక్నాలాజీ, నేటి తరం అవసరాలకు అనుగుణంగా శ్యాంసంగ్ సంస్ధ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తో మోబైల్ ఫోన్స్ ను అందించడంలో ముందుంటుందన్నారు. సెల్ ఫోన్ వినియోగం అనేది నిత్యజీవితంలో బాగమైందన్నారు. ప్రపంచం లో ఎక్కడా ఉన్న ఈ మొబైల్ ఫోన్ వ్యవస్థ మానవ సంబంధాలకు చేరువలో ఉంచుతోందన్నారు. మైబైల్ ఫోన్ లగ్జరీ వస్తువు కాదని ఇప్పుడు ఎసెన్షియల్ కమాడిటీగా మారిందని అభిప్రాయపడ్డారు.
మొబైల్ రీటైల్ చైన్ సెల్ బె సంస్ధ యం.డి సోమ నాగరాజు మాట్లాడుతూ… రాష్ట్రంలో వినియోగదారులకు విభిన్న రకాల మొబైల్ ఫోన్స్ ను అందించడంలో ముందుటామన్నారు. వినియోగదారుల ఆధారాభిమానాలతో సెల్ బె ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. సెల్ బే డైరెక్టర్ సుహాస్ నల్లచెరు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అత్యాధునిక మొబైల్ హ్యాండ్ సెట్ లను అందిస్తున్నామని, శ్యాంసంగ్ కొత్త సిరీస్ బుకింగ్ కు ఎంతో డిమాండ్ ఉందన్నారు. సెల్ బే డైరెక్టర్ సుదీప్ నల్లచెరు మాట్లాడుతూ రెండు ఫ్లాగ్ షిప్ మోడల్ లో రిలీజ్ చేసిన ఈ ఫోన్లు అత్యాధునికి ఫీచర్లు కలిగి ఉన్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో శ్యాంసంగ్ సంస్ద తెలుగు రాష్ట్రాల ఆర్.యం.యం సౌరభ్ నాయక్, జడ్.ఎస్.యం సచిన్ జైన్, ఆర్.యం డిపి. శుక్లా, ఏబీఎం సుధీర్ కుమార్ మానేపల్లి తదితరులు పాల్గొన్నారు.