టాలీవుడ్‌లో ఒక సినిమాకు సైన్ అప్ చేసిన తాజా శాండల్‌వుడ్ నటి అనూషా రాయ్. సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో నెల్సన్ సినిమాలో నటిస్తుంది. తెలుగులో తన ప్రయాణం గురించి ఎగ్జైట్‌గా ఉన్న అనూష మీడియాతో తన అనుభవాలను పంచుకుంది, “నేను ఏ పరిశ్రమలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నాను. మొదట నా పాత్ర నాకు నచ్చాలి, అప్పుడే ఆ సినిమా హిట్ అవుతుందని నా నమ్మకం. నాకు నచ్చిన కధనే ఈ నెల్సన్,
నా పాత్ర చాలా సాంప్రదాయ అమ్మాయి పాత్ర, ప్రతిరోజూ గుడికి వెళ్తూ మంచి ఆచారాలను పాటిస్తూ ఉంటాను. ఈ సినిమాలో నేను ఒక ఒక క్లాసికల్ డ్యాన్సర్ ని.