వీరు, సౌజన్య ప్రకాశ్ జంటగా సందీప్ రాఘవేంద్ర తెరకెక్కించిన అద్భుతమైన లవ్ స్టోరీ ‘ఏ కిస్ విత్ లవ్’. OAK స్టూడియోస్, షేడ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ షార్ట్ ఫిల్మ్‌కు శ్రీ వెంకట్ సంగీతం అందించగా.. డిఓపిగా దాసరి భరద్వాజ్ వ్యవరహించారు. ఎడిటింగ్ శ్రీ వర్కాల చేసారు. ఈ షార్ట్ ఫిల్మ్‌కు సంబంధించిన ప్రీమియర్ షో ఆగస్ట్ 3 సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. దీనికి ప్రముఖ నిర్మాత రామసత్యనారాయణ, లయన్ వెంకట్ గారు హాజరయ్యారు. ఈ షార్ట్ ఫిల్మ్ గురించి వాళ్లు మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించారు.
నిర్మాత రామసత్యనారాయణ గారు మాట్లాడుతూ.. ‘హీరో వీరు, హీరోయిన్ సౌజన్య ఇద్దరూ అద్భుతంగా నటించారు. ఇది టెక్నీషియన్స్ ఫిల్మ్. ఇంత తక్కువ బడ్జెట్‌లో అంత అద్భుతమైన ఔట్ పుట్ ఇచ్చిన దర్శకుడు సందీప్‌ను మెచ్చుకుని తీరాల్సిందే. 2025 తర్వాత రావాల్సిన చిత్రం ఇది…షార్ట్ ఫిల్మ్ లా లేదు..పెద్ద సినిమా లా ఉంది. సినిమా చాలా అంటే చాలా క్వాలిటీతో క్లారిటీతో తీసారు. కథను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు సందీప్. ఇక హీరో హీరోయిన్ల నటన హైలైట్. వాళ్ళకు మా నెక్ట్స్ సినిమాలలో తప్పకుండా అవకాశం ఇస్తాము’ అని తెలిపారు.
లయన్ వెంకట్ గారు మాట్లాడుతూ.. ‘రామసత్యనారాయణ గారు చెప్పినట్లు హీరో హీరోయిన్లు ప్రాణం పెట్టి నటించారు. వాళ్ళ నటనతో సినిమా రేంజ్ మరింత పెరిగింది. మరోవైపు దర్శకుడు సందీప్ రాఘవేంద్ర వర్క్ చాలా బాగుంది. అతడు ఇలాగే కష్టపడితే మంచి దర్శకుడిగా ఎదుగుతారు. ఓవరాల్‌గా “ఏ కిస్” విత్ లవ్ చాలా బాగుంది. అని తెలిపారు.
వీరు మాట్లాడుతూ.. సినిమా చూసి ఆశీర్వదించటానికి వచ్చిన పెద్దలందరికి ధన్యవాదాలు. ఇంత అద్భుతంగా రావటానికి కారణం మా డైరెక్టర్ సందీప్ గారు.
సౌజన్య ప్రకాష్ మాట్లాడుతూ.. మూవీ అందరికి నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సందీప్ గారికి కృతజ్ఞతలు.. తెలుపుకుంటున్నాను
డైరెక్టర్ సందీప్ రాఘవేంద్ర మాట్లాడుతూ.. ఎన్నో రోజులుగా కష్ట పడి.. ఎంతో ఇష్ట పడి తీసిన ఈ చిత్రం మీ అందరికి నచ్చడంతో చాలా సంతోషంగా ఉంది..ప్రసాద్ లాబ్ లో చాలా సినిమాలు చూసాను..ఇన్నాళ్ల కు నా సినిమా మీ అందరితో చూడటం చాలా చాలా ఆనందంగా ఉంది… ఎంతో బిజీ గా ఉన్నా సరే. మా సినిమా చూసి నన్ను నా టీమ్ ను ఆశీర్వదించటానికి వచ్చిన ప్రముఖ ప్రొడ్యూసర్ రామసత్యనారాయణ గారికి, లయన్ సాయి వెంకట్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు..
నటి నటులు:
వీరు
సౌజన్య ప్రకాష్
సంతోష్ బాబు,వినోద్ ఆలమూరు,మహిపాల్,నేహా
భాస్కర్.
టెక్నీషియన్స్ :
సాంగ్ కంపోజర్: సతీష్ సాధన్
మ్యూజిక్ : సాయి వెంకట్
ఎడిటర్ : శ్రీ వర్కలా
కెమెరా: భరద్వాజ్ దాసరి
పి.ఆర్.ఓ : లక్ష్మీ నివాస్
కథ, కధనం, మాటలు, దర్శకత్వం ; సందీప్ రాఘవేంద్ర