ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల యూత్‌ఫుల్ లవ్ అండ్ క్రైమ్ ఎంటర్‌టైనర్ ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ నవంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. టీజర్, పాటలు సినిమా అంచనాలను పెంచాయి. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేశారు.
దర్శకుడు మేర్లపాక గాంధీ కాన్ ఫ్లిక్ట్ ని రివిల్ చేయకుండానే చాలా చాకచక్యంగా క్యూరియాసిటీని పెంచుతూ ట్రైలర్‌ను కట్ చేశాడు. సంతోష్ శోభన్ ట్రావెల్ బ్లాగర్ గా తన యూట్యూబ్ ఛానెల్ కోసం కొత్త వీడియోని షూట్ చేయడానికి వెళ్ళిన ట్రిప్ లో ఫరియా అబ్దుల్లాని కలవడం, ప్రేమలో పడటం చాలా క్రేజీగా ప్రజంట్ చేశారు. కథాంశం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది.
మేర్లపాక గాంధీ కామెడీని డీల్ చేయడంలో దిట్ట. ఈ సినిమాలో కావల్సినంత వినోదాన్ని వుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది. ట్రైలర్ నక్సల్స్, పోలీసులు, రౌడీ బ్యాచ్ ని ప్రజంట్ చేసిన విధానం చాలా థ్రిల్లింగా వుంది. సంతోష్ శోభన్ డైనమిక్‌గా ఉన్నాడు. ఫరియా అబ్దుల్లాతో లవ్ ట్రాక్ ఆకట్టుకుంది. బ్రహ్మాజీ టైమ్ బాంబ్ ఎపిసోడ్ నవ్విస్తుంది. నెల్లూరు సుదర్శన్ తన కామిక్ టైమింగ్‌తో అలరించాడు.