Pathaan : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పఠాన్’ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వచ్చిన ఈ యాక్షన్ సినిమాలో షారుక్ సరసన దీపికా పదుకొణే హీరోయిన్ గా నటించింది. జాన్ అబ్రహాం విలన్ గా అదరగొట్టాడు. చాలా కాలంగా వరుస ప్లాపులను ఖాతాలో వేసుకున్న షారూఖ్ ఇప్పుడు భారీ విజయాన్ని అందుకున్నారు. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే రూ. 200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టి ఔరా అనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో షారుఖ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా బుధవారం విడుదలైంది. తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టింది. దాంతో తొలిరోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన బాలీవుడ్ సినిమాగా రికార్డు సృష్టించింది. యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ -2 తొలి రోజు (53.9 కోట్ల) కలెక్షన్స్ రికార్డును అధిగమించింది. బుధ, గురువారాల్లో కలిపి ప్రపంచ వ్యాప్తంగా పఠాన్ చిత్రం ఏకంగా రూ. 235 కోట్లు రాబట్టింది. రెండో రోజు కేవలం హిందీలోనే రూ. 70 కోట్లు వచ్చాయని తెలుస్తోంది. తెలుగు, తమిళంలో 2-3 కోట్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
నాలుగేళ్ల తర్వాత బిగ్ స్క్రీన్‌పై షారూఖ్ ఖాన్ తనదైన లుక్స్, స్టైల్, మేనరిజమ్‌తో పాటు వావ్ అనిపించే యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకున్నారు. ఐదు పదులు వయసు దాటిన ఫిజిక్ తో షారూఖ్ అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక దీపికా పదుకొనె బేషరమ్ సాంగ్‌లో అందాలను ఆరబోయడమే కాకుండా.. యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా అదరగొట్టింది. ఇక విలన్‌గా నటించిన జాన్ అబ్రహం తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు. వీరితో పాటు గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన సల్మాన్ ఖాన్.. సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు.