యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. రష్మిక మందన్న హీరోయిన్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 4న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే సెన్సారు కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికేట్ లభించింది.
ఇప్పటి వరకు ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కు విశేష స్పందన లభించింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా సినిమా బజ్‌ను మరింత పెంచడానికి సహాయపడుతోంది. ఇప్పటి వరకు విడుదల చేసిన మూడు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది.నటీనటులు : శర్వానంద్, రష్మిక మందన్నా, వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు.