నాగేశ్వరి (పద్మ) సమర్పణలో పి.ఎస్. ఆర్. కుమార్ (బాబ్జీ) నిర్మాతగా హరి కొలగాని దర్శకత్వంలో రూపొందిన సినిమా షికారు. సాయి ధన్సిక, తే్‌జ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, ధీరజ్ ఆత్రేయ నవకాంత్, ప్రధాన తారాగణంగా నటించారు. సాయి లక్ష్మీ క్రియేషన్స్ బేనర్‌రై పూపొందింది. శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చారు.
షికారు ట్రైలర్ ఆవిష్కరణ వి.వి.వినాయక్ చేశారు. గురువారంనాడు ప్రసాద్ లేబ్‌లో జరిగిన కార్యక్రమంలో వినాయక్ మాట్లాడుతూ, బాబ్జీకు నా సినిమాపై చాలా నమ్మకం, జడ్జిమెంట్ బాగా తెలుసు. వైజాగ్ పంపిణీదారుడుగా మంచి పేరు వుంది. దర్శకుడు హరి సినిమా చేయడం నిర్మాతను ఒప్పించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే నిర్మాత కాంప్రమైజ్ కాడు. కథలపై ఆయన పట్టు అలాంటిది. ఈ సినిమా కూడా మంచివిజయం సాధిస్తుందనే నమ్మకముంది అన్నారు.దర్శకుడు హరి మాట్లాడుతూ, వినాయక్ గారు వచ్చి ఆశీర్వదించడం చాలా ఆనందంగా వుంది. మంచి యూత్ ఫుల్ సినిమా. ఇలాంటి కథలు నేడు రావాలి. ప్రేక్షకుడికి పుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది అని తెలిపారు.
ఇంకా చిత్ర యూనిట్ పాల్గొని చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు