అనిల్ సుంకర ప్రౌడ్లీ ప్రెజెంట్.. స్కై లైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిషోర్ గరికిపాటి నిర్మాతగా మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం షో టైం. ఈ రోజు ట్రయిలర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరుపుకుంది. నవీన్ చంద్ర హీరోగా కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటిస్తున్న వినూత్నమైన థ్రిల్లర్ చిత్రం జూలై 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ప్రజెంట్ చేస్తున్నారు.
ట్రయిలర్ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ముఖ్యంగా ఒక మర్డర్ చుట్టు అల్లుకున్న కథ అని ట్రయిలర్ చూస్తే అర్థం అవుతుంది. ఈ చిత్రం థ్రిల్ ను పంచడంతో పాటు ఆద్యంతం కామెడీతో అలరించబోతుందని అర్థం అవుతుంది. ఇక కోర్ట్ రూమ్ డ్రామా, పోలీస్ ఇన్విస్టిగేషన్ సీన్లతో ఊపిరి బిగపట్టి చూసే ఆసక్తికరమైన సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రయిలర్ విడుదల కార్యక్రమంలో అతిథులు పాల్గొని మాట్లాడారు.
శ్రీనివాస్ గవిరెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాకు పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. షో టైం చాలా బాగా వచ్చింది. ప్రతీ యాక్టర్ అద్భుతంగా చేశారు అన్నారు. చాలా కొత్త పాయింట్ తో చాలా ఫ్రెష్ గా వచ్చింది అని, ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని చెప్పారు.
రాజరవీంద్ర మాట్లాడుతూ.. చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాదు కాన్సెప్ట్ బాగుంటే సినిమా చాలా బాగా ఆడుతుంది అన్నారు. ఈ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ మదన్ దక్షిణామూర్తి కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు
దర్శకుడు మదన్ దక్షిణామూర్తి మాట్లాడుతూ.. ఈ సినిమా నిర్మాత కిషోర్ గరికిపాటికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికి థాంక్స్ చెప్పారు. పరిశ్రమలో ఒక పెద్ద వ్యక్తి సినిమా చూసి ఇది రియల్ షో టైం అని చెప్పారు అని చెప్పారు. దాంతో సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని నమ్మకం వచ్చిందని చెప్పారు. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు.
దాము మాట్లాడుతూ..మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర అద్భుతమైన టెక్నిషన్ అన్నారు. ఈ సినిమాకు కచ్చితంగా ప్రాణం పెట్టి పనిచేశారు అని చెప్పారు. నవీన్ చంద్ర గొప్ప నటుడు అని చెప్పారు. షో టైం తో ఇంకా మంచి పేరు రావాలని కోరారు. సినిమా జులై4 న విడుదల అవుతుంది అందరూ ఆదరించాలని కోరారు. ఎవరు పైరసీని ప్రోత్సహించవద్దు అని కోరారు.
పొలిమేర డైరెక్టర్ అనిల్ విశ్వానాథ్ మాట్లాడుతూ.. 28 డిగ్రీ సెల్సీయస్ సినిమాలో హీరో నవీన్ చంద్ర, పొలిమేర సినిమాలో హీరోయిన్ కామాక్షి భాస్కర్ల ఇద్దరితో తను పని చేసాను అని ఇద్దరి సూపర్ యాక్టర్స్ అన్నారు. అలాగే దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇద్దరికి బెస్ట్ యాక్టర్స్ అవార్డులు రావడం, వారు ఇద్దరు ఈ సినిమాలో నటించడం చాలా ఆసక్తికరంగా ఉందన్నారు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పారు.
హీరోయిన్ కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ.. సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, సినిమా అందరికి నచ్చుతుందని చెప్పారు. చిన్న సినిమా కానీ మంచి కంటెంట్ ఉన్న సినిమా అన్నారు. నవీన్ చంద్ర ఒక అద్భుతమైన నటుడు అన్నారు. ఆయన్ను అభిమానించే నేను తనతో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. అలాగే సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు.
హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. చాలా మంచి సినిమా చేసినప్పుడు ఆసక్తితో పాటు ఉత్సాహం, భయం కూడా ఉంటుందన్నారు. డైరెక్టర్ మదన్ తో పని చేయడం చాలా బాగా అనిపించిందని అన్నారు. ఎడిటర్ శరత్, డీఓపీ వినోద్ శ్రమ ఎంతో ఉందన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్రతో పని చేయడం చాలా మంచి అనుభూతి అని చెప్పారు. ప్రొడక్షన్ డిజైనర్ సుప్రియ ఎంతో కష్టపడి, ఇష్టపడి పని చేశారు అన్నారు. రాజరవీంద్ర తో పని చేయడం చాలా కొత్తగా ఉందన్నారు. ఆయన కూడా చాలా కష్టపడ్డారు అని చెప్పారు. నరేష్ తో పని చేయడం కూడా చాలా బాగా అనిపించింది అన్నారు. ఆయనతో చాలా సరదగా పనిచేశామన్నారు. సినిమాలో పని చేసిన పిల్లలు కూడా చాలా బాగా చేశారు అన్నారు. ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్న ప్రొడ్యూసర్ అనిల్ సుంకరకు
ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సినిమాపై ఎంత నమ్మకం ఉంటే ఆయన ప్రెజెంట్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు అని నవీన్ చంద్ర అన్నారు. నాకు తెలిసింది సినిమా ఒక్కటే అని , కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చే సినిమాలనే చేస్తా అని చెప్పారు. ఇక షో టైం సినిమా కచ్చితంగా అందరికి నచ్చుతుందని చెప్పారు. జులై 4న మీతో కలిసి నేను కూడా చూస్తా అని చెప్పారు. అలాగే కామాక్షి అద్భుతమైన నటీ అన్నారు. తన గురించి కచ్చితంగా ఇండియా మొత్తం మాట్లాడుకుంటారు అని చెప్పారు. కచ్చితంగా సినిమా అందరకి నచ్చుతుందని చెప్పారు.
విడుదలైన ట్రయిలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకుడిని థియేటర్లో కట్టిపడేసి, అన్ని వర్గాల ప్రేక్షకులను రంజింపజేసే అద్భుతమైన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు కడుపుబ్బ నవ్వించే కామెడీ ఉందని తెలుస్తుంది. షో టైం మూవీ జూలై 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సందర్భంగా మూవీ కచ్చితంగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతుందని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది.
నటీనటులు : నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల, నరేష్, రాజా రవీంద్ర, రోహిణి, జెమిని సురేష్ తదితరులు
దర్శకత్వం: మదన్ దక్షిణామూర్తి
నిర్మాత: కిషోర్ గరికిపాటి
బ్యానర్: స్కై లైన్ మూవీస్
సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రాఫర్: టీ వినోద్ రాజా ఎమ్ఎఫ్ఐ
ఎడిటర్: శరత్ కుమార్
ప్రొడక్షన్ డిజైనర్ : సుప్రియ బట్టేహపాటి
డైలాగ్స్ : శ్రీనివాస్ గవిరెడ్డి
లైన్ ప్రొడ్యూసర్స్: చంద్రశేఖర్ మహదాస్, పుష్య మిత్ర గంట