Curd : ఎండాకాలంలో చాలా మంది ఎక్కువగా పెరుగుని తింటారు. దీనిని తినడం వల్ల కలిగే లాభాలు,అలాగే నష్టాల గురించి తెలుసుకుందాం ..
పెరుగు.. చాలా మందికి ఇష్టమైన వంటకం. అన్నం తినేటప్పుడు ఏ కూరలు ఉన్నా. కొంతమంది ఈ పెరుగుతోనే భోజనాన్ని ముగిస్తారు. వేసవి తాపం నుంచి తప్పించుకునేందుకు పెరుగుని మజ్జిగలా చేసుకుని తాగుతారు. ఎన్ని వంటకాలు ఉన్నా పెరుగు లేనిదే ముద్ద దిగదు. అయితే, పెరుగుని తింటే మంచిది కాదా.. నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.
కొన్ని సైడ్ ఎఫెక్ట్స్..
కొంతమందికి పెరుగు తింటే మొటిమలు, స్కిన్ అలర్జీ, జీర్ణ సమస్యలు పెరుగు తిన్న తర్వాత ఎక్కువగా వేడిగా అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. పెరుగు తింటే సాధారణంగా శరీరం చల్లబడుతుంది.
కానీ, ఇది వేడెక్కడం వంటి లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. చాలా మంది ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి.
లాభాలు, నష్టాల విషయానికొస్తే.
ఆయుర్వేదం ప్రకారం, ఎండాకాలంలో ప్రతిరోజూ తీసుకోవడం వల్ల బాడీలో కొన్ని లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. సాధారణంగా వ్యక్తికి వాత, పిత్త, కఫా దోషాలు ఉంటాయి. అవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి.
ఎందుకు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది..
ఆయుర్వేదం ప్రకారం, పెరుగు రుచిలో పుల్లని, వేడిగా ఉంటుంది. జీర్ణం చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇది కఫ, పిత్త దోషాలలో ఎక్కువగా ఉంటుంది. వాత దోషంలో తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఏ సీజన్‌లో అయినా, పెరుగు తినేటప్పుడు కొన్ని గుర్తుంచుకోవాలి. అవేంటంటే..
ఎలా తినాలి..
పోషకాహార నిపుణుల ప్రకారం.. పెరుగు శరీరంలో వేడి పెంచుతుంది. కాబట్టి, రెగ్యులర్‌గా తినొద్దు. కానీ, ఇందులో రాళ్ళ ఉప్పు, కారం, జీలకర్ర వంటివి కలిపి మజ్జిగలా తీసుకోవచ్చు. పెరుగులో నీరు కలిసినప్పుడు అది వేడి ప్రభావాలను బ్యాలెన్స్ చేస్తుంది.