Movie దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సీతారామం మూవీ ఎంత హిట్ అయిందో తెలిసింది అయితే సెప్టెంబర్ 9 నుంచి ఓటీటీలో వచ్చిన ఈ మూవీకి విపరీతమైన స్పందన వస్తుంది. సీతారామం మూవీ థియేటర్ దగ్గర ఓ సంచలనం సృష్టించింది. అలాంటి మూవీ ఇప్పుడు ఓటీడీలో హల్చల్ చేస్తుంది. సెప్టెంబర్ 9న మొదలైన ఈ మూవీ ఆ రోజు రాత్రి నుంచే ఓటీటీలో సందడి చేస్తుంది. ఈ సినిమాకి దేశమంతటా కోట్ల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి..
గడిచిన నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి కోట్లలో వ్యూస్ హోరెత్తిపోతున్నాయని డిజిటల్ మీడియా వర్గాలు చెప్తున్నాయి.. సినిమా హాళ్లలో ఎవరైతే మిస్ అయ్యారో వాళ్లతో పాటు దియేటర్లలో చూసిన వాళ్లు కూడా మళ్లీ మళ్లీ ఈ సినిమాని చూస్తున్నారు.. మంచి కంటెంట్ తో వస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఈ సినిమా మరోసారి నిరూపించింది. ఇప్పుడు ఓటీటీలో చూసిన వాళ్లంతా ఇంత మంచి సినిమాను థియేటర్లో ఎలా మిస్ అయ్యాం అంటూ కామెంట్లు పెడుతున్నారు..
ఎలాంటి రొమాంటిక్ సీన్లు లేకుండా స్వచ్ఛమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఒక అద్భుతమైన చెప్పాలి. సీతామహాలక్ష్మి, రామ్ ల ప్రేమ కథను అద్భుతంగా తెరకెక్కించి.. నిజమైన ప్రేమ కథకు అర్థం చెప్పిన ఈ సినిమా గొప్ప విజయం సాధించింది అనే చెప్పాలి.సీతా మహాలక్ష్మి లేదా ప్రిన్సెస్ నూర్జహాన్ గా మృణాల్.. లెఫ్టినెంట్ రామ్ గా దుల్కర్ అద్భుతమైన నటన కనబరిచారు. మిగతా ప్రధాన పాత్రలు కూడా చాలా బాగా మెప్పించారు.