Smt Gadwala Vijayalakshmi Mayor GHMC, Nanadamuri Balakrishna, Basava Tarakam Cancer Hospital, Telangana News, Telugu World Now,
శ్రీమతి గద్వాల విజయలక్ష్మి పుట్టిన రోజు సందర్భంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ ఘనంగా స్వాగతం పలికారు.
గ్రేటర్ హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా నేడు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం కోసం హాస్పిటల్ కు వచ్చిన శ్రీమతి గద్వాల విజయలక్ష్మికి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఛైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ ఘనంగా స్వాగతం పలికారు. తమ కుటుంభ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ పుట్టిన రోజు హాస్పిటల్ కు వచ్చిన మేయర్ ను ప్రత్యేక సారె అందజేసి సత్కరించారు.
అనంతరం మేయర్ పుట్టిన రోజు పురస్కరించుకొని హాస్పిటల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన కేక్ ను శ్రీమతి గద్వాల విజయలక్ష్మి కట్ చేశారు. కేక్ కటింగ్ అనంతరం హైదరాబాద్ నగర ప్రధమ పౌరురాలు హాస్పిటల్ లో ఉన్న చిన్న పిల్లల వార్డు మరియు ఆరోగ్య శ్రీ వార్డులలో చికిత్స పొందుతున్న వారికి పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మీడియా తో శ్రీ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తేలియజేశారు. ఈ లోక మనుగడలో స్త్రీ ప్రధాన పాత్ర పోసిస్తున్నదని, స్త్రీ లేకుంటే మనుగడే లేదన్న విషయాన్ని గుర్తించిన తమ నాన్న గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాకుండా ఎన్నికలలో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కలిపించిన విషయాన్ని గుర్తు చేశారు. అలానే మహిళలకు ప్రత్యేకంగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారని అంటూ అదే కోవలో హిందుపురం నియోజకవర్గంలో భాగమైన హిందుపురం మునిసిపాలిటీకి కూడా మొదటి సారి మహిళలను ఛైర్ పర్శన్ గా చేయడం జరిగిందని ఆయన చెప్పారు. జర్నలిజంలో డిగ్రీ తో పాటూ న్యాయశాస్త్రంలో పట్టా పొంది అమెరికాలో ఉన్నత చదువులు చదువుకొన్న మేయర్ ప్రజా సేవ చేయాలని నిర్ణయించి కొనసాగడం ఎంతో ప్రశంసనీయమని చెప్పారు. కేసీయార్ నాయకత్వంలోని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం హాస్పిటల్ కు 5.75 కోట్ల రూపాయల బిల్డింగ్ రెగ్యులరైజేషన్ ను మాఫీ చేస్తూ నిర్ణయం చేసి ఎంతో సహాయం చేశారని అలానే పలు సందర్భాలలో ముఖ్యమంత్రి హాస్పిటల్ కు మేలు కలిగించే నిర్ణయాలు తీసుకొన్నారని కృతజ్ఞతలు తెలియజేశారు. అలాంటి కేసీయార్ స్పూర్తితో, తండ్రి కేశవరావు గారు నడుపుతున్న భాటలో నడుస్తున్న విజయలక్ష్మిగారు నగర ప్రధమ పౌరులారిగా ఇక్కడకు రావడం ఎంతో సంతోషకరమైన అంశం అని అంటూ ఆమె ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు.
అనంతరం శ్రీమతి గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ గతంలో తాను మేయర్ గా హాస్పిటల్ ను సందర్శించడం జరిగిందని, ఆనాడే ఇక్కడ పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది నిబద్దత, సేవా తత్పరత అర్థమైనాయని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇదే విధానంలో పని చేస్తూ హాస్పిటల్ మరింత ప్రజాదరణ పోందుతుందని అశీస్తున్నట్లు తెలిపారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేసిన శ్రీ నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమాలలో శ్రీ నందమూరి బాలకృష్ణతో పాటూ శ్రీ జెయస్ ఆర్ ప్రసాద్, ట్రస్టు బోర్డు సభ్యులు, BIACH&RI; డా. ఆర్ వి ప్రభాకర రావు, CEO, BIACH&RI; శ్రీ రవికుమార్, COO, BIACH&RI; డా. ఫణి కోటేశ్వర రావు, మెడికల్ సూపర్నింటెండెంట్, BIACH&RI; డా. కల్పనా రఘునాథ్, ఆసోసియేట్ డైరెక్టర్ (అకడమిక్ & యాడ్ లైఫ్) తదితరులు పాల్గొన్నారు.