Crime బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ ఆగస్టు 22 గోవాలో హత్యకు గురయ్యారు.. అయితే వివాదాస్పదంగా మారిన ఈమె హత్య కేసును ఇప్పటివరకు గోవా ప్రభుత్వం విచారించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈమె హత్య కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తూ గోవా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ ఆగస్టు 22 గోవాలో ప్రీ ప్లాన్డ్ గానే చంపబడినట్టు ప్రాథమిక విచారణలో తెలిసింది. ఇప్పటికే సోనాలి వ్యక్తిగత సహాయకుడైన సుధీర్ సాంగ్వాన్ ఆమె ఆస్తి కోసం డ్రగ్స్ అలవాటు చేసినట్టు… ఆమెకు మత్తు మందు ఇవ్వటానికి సుఖ్‌విందర్ సహాయం చేశాడని సాంగ్వాన్ అంగీకరించాడు.. అలా జరిగిన పార్టీలో ఆమె తాగిన డ్రింకులో హానికరమైన మత్తుపదార్థాలు ఎక్కువగా ఉండటం వల్లే ఆమె మరణించింది అని గోవా పోలీసులు వెల్లడించారు.. అయితే ఈ హత్యకు సంబంధించి ఇప్పటికే నిందితులు సుధీర్ సంగ్వాన్, సుఖ్‌విందర్‌లను రెండు రోజుల రిమాండ్ తర్వాత గోవా పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అక్కడి నుంచి కోర్టు వారిద్దరినీ జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అయితే హత్యకు గల కారణాలు పూర్తిగా తెలియనప్పటికీ ఈ విషయంపై సోనాలి ఫోగట్ కూతురు హత్యకు సంబంధించి తదుపరి విచారణను సిబిఐకు అందించాలని కోరింది..
ఆమె విజ్ఞప్తిని అంగీకరించిన గోవా సీఎం సీబీఐ విచారణకు ఆదేశించారు. ఈ నెల 23వ తేదీలోగా ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించకుంటే 24న ఖాప్ పంచాయతీ జాట్ ధర్మశాలలో మరోసారి విచారణ చేపడతామని సోనాలి ఫోగట్ కుమార్తె హెచ్చరించారు. అంతేకాకుండా తనకు, కేసు వాదిస్తున్న వారికి భద్రత కల్పించాలని కోరింది.