Devotional News: హిందూ సంప్రదాయం ప్రకారం వినాయకుడికి అగ్రస్థానం ఉందని చెప్పుకోవాలి. ఎటువంటి శుభకార్యమైన ముందుగా విగ్నేశ్వరుడికి పూజ చేసిన తర్వాతే ఆ పనిని ప్రారంభించడం జరుగుతుంది. ఇంటి దోషం ఉన్న వినాయకుడి ప్రతిష్టలు చేస్తూ ఉంటారు అంత విశిష్టత ప్రాముఖ్యత వినాయకుడికి ఉంటుంది. ఆగస్టు 31న వినాయక చవితియే సందర్భంగా వినాయకుడకు పూజలో ఏమి తీసుకోవాలో తెలుసుకోండి
వినాయకుని పూజలు ఉండ్రాళ్ళు, ఆకులు, పండ్లు, పువ్వులతో కూడిన పత్రి ఆహారాలను పెట్టడం ద్వారా ఆయన అనుగ్రహం మన మీద ఉంటుందని మన పురాతన కాలం నుంచి వింటున్నాము. అయితే వినాయకుని పూజ కొరకు వాడే పత్రిలో అనేకమైన ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి.భాద్రపదమాసంలోనే పత్రితో పూజాకార్యక్రమాలను నిర్వహిస్తారు. అయితే ఈ మాసంలో వర్షాలు అధికంగా ఉండడం వల్ల నలువైపుల నదులు కాలువలు చెరువులు నీటితో నిండిపోయి సూక్ష్మజీవులు వ్యాపించే అవకాశం అధికంగా ఉండటం వల్ల పత్రి పూజలో ఉపయోగించడం జరుగుతుంది.
వినాయకుడు పూజలు ద్వారా ప్రతి ఇంటిలో ఈ పత్రితో పూజ చేసుకోవడం ద్వారా విష జ్వరాలు వంటి సమస్యలు మటుమాయం అయిపోతాయి. ఈ పత్రిలో ముఖ్యమైనవి తులసీ, గరిక, నేరేడు, మారేడు, మరువం, ఉమ్మెత్త, ఉత్తరేణి మొదలైనవన్నీ వినాయకుడు పూజలో ఉపయోగించడం జరుగుతుంది. అలానే అనిపిస్తది ఉండ్రాళ్ళను నైవేద్యంగా పెట్టి చిన్న పిల్లలకు ఇవ్వడం ద్వారా ఆ ఇంటికి సకల మేలు జరుగుతాయని పురోహితులు చెబుతూ ఉంటారు. ఈ పూజ చేసిన వారికి సంవత్సరం పొడుగు తా లక్ష్మీ అమ్మవారు ఆ ఇంట తాండవం చేస్తుందట.