Shruti Haasan:ఇటీవల జరిగిన కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో శ్రుతి హాసన్ మాట్లాడుతూ హీరోయిన్స్ రెమ్యునరేషన్ గురించి వ్యాఖ్యలు చేసింది. గతంలో ప్రియాంక చోప్రా హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకోవడానికి నేను రెండు దశాబ్దాలు కష్టపడాల్సి వచ్చింది అని చెప్పింది అని అలాగే ,ఒక సినిమా లో హీరో పాత్ర కి ఎంత విలువ వుందో హీరోయిన్ పాత్ర కి కూడా అంతే విలువ వుంది అలాంటి అప్పుడు రెమ్యునరేషన్ లో తేడా ఎందుకు అని ప్రశ్నించింది
అయితే శ్రుతి హాసన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది.ఈమె ప్రస్తుత సినిమాలు అన్నీ సీనియర్ నటులతోనే చేస్తుంది . ఇటీవల సంక్రాంతికి వాల్తేరు వీరయ్య(Waltair Veerayya), వీరసింహారెడ్డి(Veera SimhaReddy) సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టింది. త్వరలో సలార్(Salaar) సినిమాతో రాబోతుంది. మరిన్ని చిత్రాలు శ్రుతి హాసన్ చేతిలో ఉన్నాయి. తాజాగా శ్రుతి హాసన్ ఫ్రాన్స్(France) లో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన 76వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్(Cannes Film Festival) లో పాల్గొంది. బ్లాక్ డ్రెస్ లో శ్రుతి హాసన్ కాన్స్ రెడ్ కార్పెట్ పై నడిచి ఆహా అనిపించింది.
ఈ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ప్రియాంక చోప్రా అద్భుతం సాధించారు. మేమంతా ఇంకా కష్టపడుతున్నాం. మన దగ్గర సమాన వేతనం గురించి కనీస చర్చలు కూడా లేవు. హీరోలతో పాటు హీరోయిన్స్ కి సమాన రెమ్యునరేషన్ లభించే రోజు వస్తుందని ఎదురు చూస్తున్నాను అని తెలిపింది. దీంతో శ్రుతిహాసన్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ పై కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ఈమె తరువాత చేసే సినిమా కి సమాన వేతనం అడగవచ్చు అని కొందరి అభిప్రాయం ..