Entertainment స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్‌కు సంబంధించిన ఓ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని గురించే ఈ కథనం.
‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేసింది కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్. తన అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంటూ వరుసగా ఆఫర్లు చేజిక్కించుకుంటోంది. ఇతర భాషలతో పోలిస్తే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసిన శ్రుతి.. వీలు చిక్కినప్పుడల్లా కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోంది. అయితే ప్రేమ, బాయ్ ఫ్రెండ్ వంటి విషయాలను చాలా మంది హీరోయిన్స్ సీక్రెట్ గా ఉంచుతుంటారు. కానీ ఇలాంటివి చెప్పటానికి నేను భయపడను.. అంటూ అన్ని విషయాలను షేర్ చేసుకునే శృతిహాసన్ ఇటు హీరోయిన్ గా.. అటు సింగర్ గా కెరియర్ లో దూసుకుపోతుంది. తనకంటూ ప్రత్యేకమైన పేరు తెచ్చుకొని కెరీర్ లో రాణిస్తుంది ఈ అమ్మడు. అయితే ఈ మధ్య తను భారీగా రెమ్యునేషన్ కూడా పెంచిందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి.. తాజాగా అదిరిపోయే ఓ డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. తనకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ.. బోల్డ్ మేకప్‌లో బ్లాక్ జంప్ సూట్‌తో డ్యాన్స్ చేసిన వీడియో షేర్ చేసింది. తన తండ్రి కమల్ హాసన్ నటించిన రాజా కాయ వేచ్చ.. అనే సూపర్ హిట్ సాంగ్‌కు స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆమె అభిమానులు ‘వావ్’, ‘సూపర్’, ‘కేక’, ‘చాలా బాగుంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.