టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం అనేక బ్లాక్‌బస్టర్‌లను నిర్మించింది. ఇప్పుడు కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటిని హీరోగా పరిచయం చేయడానికి మరో భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించనుంది. ఇది రాధా కృష్ణ దర్శకత్వం వహించనున్న తెలుగు – కన్నడ ద్విభాషా చిత్రం.
ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం అత్యంత వైభవంగా శుక్రవారంనాడు ప్రారంభమైంది. ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేయగా, కర్ణాటక రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ముహూర్తం షాట్‌కు ఎస్.ఎస్. రాజమౌళి క్లాప్ కొట్టగా, కన్నడ లెజెండ్ క్రేజీ స్టార్ డాక్టర్ రవిచంద్ర వి కెమెరా స్విచాన్ చేశారు. తారాగణం: కిరీటి, శ్రీలీల, జెనీలియా, డాక్టర్ రవిచంద్ర వి తదితరులు నటించనున్నారు.