Movie ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ఆస్కార్ నామినేషన్స్‌కు అర్హత సాధించకపోవడంపై ప్రేక్షకులు, పలువురు సినీప్రముఖులు నిరాశచెందారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయ్యింది. సినిమా అభిమానులు చాలా మందికి ఆ నిర్ణయం మింగునపడలేదు. అయితే ఇప్పుడా అవకాశం ఇంకా మిగిలి ఉందని తెలుస్తోంది. దీని కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ పరోక్షంగా రంగంలోకి దిగబోతోంది. ఎలా అయినా ఆస్కార్ నామినేషన్ లో ఉండాలని గట్టిగా అనుకున్నట్లు తెలుస్తుంది
రంగంలోకి అమెరికా డిస్ట్రిబ్యూటర్.. ‘ఆర్ఆర్ఆర్’ అభిమానులకు శుభవార్త ఏంటంటే… సినిమా అమెరికా డిస్ట్రిబ్యూటర్ దైలన్ మార్చెట్టి.. తమ సినిమాను అన్ని విభాగాల్లో నామినేట్ చేయాలని ఆస్కార్ అకాడమీలోని పదివేల మంది సభ్యులకు పిలుపు ఇవ్వనున్నట్లు తెలిపారు. వారితో కలిసి క్యాంపెయిన్ ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు.
ఉత్తమ సినిమా, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే(రాజమౌళి-విజయేంద్రప్రసాద్), లీడ్ యాక్టర్స్(ఎన్టీఆర్, రామ్‌చరణ్), సహాయ నటీనటులు(అజయ్దేవగమ్, ఆలియాభట్), ఒరిజినల్ సాంగ్(నాటునాటు), ఒరిజినల్ స్కోర్(ఎమ్ఎమ్ కీరవాణి), సినిమాటోగ్రఫీ(కేకే సెంథిల్‌కుమార్).. ఇంకా మిగతా విభాగాల్లో నామినేషన్స్‌కు ‘ఆర్ఆర్ఆర్’ను సబ్మిట్ చేయనున్నట్లు దైలన్ మార్చెట్టి పేర్కొన్నారు. “గత ఆరు నెలల్లో రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్‌కు ఎంతో థ్రిల్‌కు గురయ్యారు. ఇండియాస్ ఆల్‌టైమ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలిచింది. నెట్‌ఫ్లిక్స్‌లో దాదాపు 14వారాల పాటు నిరంతరంగా గ్లోబల్ వైడ్‌గా ట్రెండ్ అవుతూ చరిత్ర సృష్టించింది. ఈ చిత్రం తర్వాత మళ్లీ థియేటరల్నీ కళకళలాడాయి. కాబట్టి ఆర్ఆర్ఆర్ అన్ని విభాగాల్లో నామినేట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం” అని అన్నారు.