Hunt Movie : ప్రముఖ హీరో సుధీర్ బాబు గురించి అందరికీ తెలిసిందే. తనదైన శైలిలో వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందుతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు చెల్లి భర్త గానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందారు సుధీర్ బాబు. ఇక ఈయన ప్రస్తుతం ‘హంట్’. గన్స్ డోంట్ లై అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్ తో ఒక సినిమాలో నటిస్తున్నారు. మహేష్ సూరపనేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా.. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో ఈరోయిన్ లేకపోవడం గమనార్హం కాగా.. కేవలం ఒక్క సాంగ్ మాత్రమే ఈ మూవీ లో ఉంది. ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
అలానే ఈ సినిమాలో ‘ప్రేమిస్తే’ ఫేమ్ భారత్, హీరో శ్రీకాంత్ ముఖ్య పాత్రలు చేస్తుండగా గోపురాజ్ రమణ, మౌనిక రెడ్డి, పలువురు నటులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఇక ఈ మూవీ ట్రైలర్ ని ఇవాళ విడుదల చేశారు మేకర్స్. రెండు నిముషాలు నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఫుల్ సస్పెన్స్ తో నడిచింది. ఈ చిత్రంలో సుధీర్ బాబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ కనిపించబోతున్నాడు.
ట్రైలర్ ఓపెనింగ్ షాట్ లోనే సుధీర్ బాబుకి కార్ యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ వల్ల తన జీవితంలోని కొన్ని రోజుల గతాన్ని మర్చిపోతాడు. అయితే ప్రమాదానికి ముందు సుధీర్ బాబు ఒక హై ప్రొఫైల్ కేసు సాల్వ్ చేసే పనిలో ఉంటాడు. యాక్సిడెంట్ వల్ల ఆ కేసు డీటెయిల్స్ మొత్తం మర్చిపోతాడు. దీంతో తన దగ్గర ఉన్న డాక్యూమెంటల్ ప్రూఫ్ ని బట్టి కేసు హంట్ మొదలు పెడతాడు. చివరాఖరికి ఆ కేసుని సాల్వ్ చేశాడా? లేదా? అనేది మిగతా కథ అని అర్ధమవుతుంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ ట్రైలర్ తో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాయని చెప్పాలి. ఈ ట్రైలర్ ని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాంఛ్ చేశారు.