Pawan Kalyan OG : ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. చేతి నిండా వరుస సినిమాలతో ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో నటిస్తున్నారు పవన్. అలానే యంగ్ డైరక్టర్ సుజిత్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. డీవీవీ దానయ్య ప్రొడ్యూసర్ గా చేస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి అన్నపూర్ణ స్టూడియోస్ పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేయగా.. పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈవెంట్ కి నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబుతో పాటు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నిర్మాత డివివి కూడా ఆర్ఆర్ఆర్ వంటి సక్సెస్ తో ఉండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
సుజిత్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని అందరికీ తెలిసిందే. రన్ రాజా రన్ సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ డైరెక్టర్… సాహో అనుకున్నంత హిట్ అవ్వకపోయినా, మూవీలోని యాక్షన్ సీక్వెన్స్ అండ్ హీరో క్యారక్టరైజేషన్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. సౌత్ కంటే నార్త్ లో ఈ సినిమాకి ఎక్కువ ఆదరణ లభించడం గమనార్హం. ప్రస్తుతం ‘ది కాల్ హిమ్ OG’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ మొదలైంది. టైటిల్ బట్టి చూస్తే పవన్ కళ్యాణ్.. పంజా మూవీ తరహా రోల్ లో కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది.
ఇటీవల దర్శకులు గోపీచంద్ మలినేని, బాబీ తమ అభిమాన హీరోలను వింటేజ్ వెర్షన్ లో చూపించి అభిమానులను ఖుషి చేశారు. ఇప్పుడు పవన్ కి వీరాభిమాని అయిన సుజిత్ కూడా పవన్ ని వింటేజ్ వెర్షన్ లో చూపించబోతున్నాడని సంబర పడుతున్నారు. కాగా భీమ్లా నాయక్ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన రవి కె చంద్రన్ ఈ చిత్రానికి పని చేస్తున్నాడు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ తర్వాత మరోసారి పవన్ సినిమాకి పని చేస్తుండడంతో హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.