Suriyas Next Jai Bhim First Look Released, Rajisha Vijayan, Rao Ramesh, Prakash Raj, Directo TJ Gnanvel, Telugu World Now,
FILM NEWS: సూర్య పుట్టినరోజు సందర్భంగా `జై భీమ్` ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల
తమిళస్టార్ హీరో సూర్య ఇటీవల ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో సూపర్‌సక్సెస్ అందుకున్నారు. జూలై 23 సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 39వ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. జె. జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి ‘జై భీమ్’ అనే పవర్‌ఫుల్ టైటిల్ కన్ఫర్మ్ చేశారు.
ఈ సందర్భంగా రిలీజ్‌చేసిన పోస్టర్లో సూర్య లాయర్ గా కనిపిస్తున్నారు. పోస్టర్‌ని బట్టి, తమ భూముల కోసం పోరాడే పేదల తరపున అండగా నిలబడే పవర్‌ఫుల్ లాయర్‌గా ఆయన కనిపించనున్నారని అర్థమవుతోంది. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద సుర్య శివకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్ సహ నిర్మాత. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో రాజీషా విజయన్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్, రావు రమేష్, మణికందన్, జయప్రకాశ్ తదితరులు కీలకపాత్రలలో నటిస్తున్నారు. సేన్ రోల్డన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి ఎస్ఆర్ కథీర్ సినిమాటోగ్రాఫర్, పిలోమిన్ రాజ్ ఎడిటర్.
తారాగణం: సూర్య, రాజీషా విజయన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, సంజయ్ స్వరూప్
సాంకేతిక వర్గం:
దర్శకత్వం – టీజే జ్ఞాపవేల్
సంగీతం – సేన్ రోల్డన్
సినిమాటోగ్రఫి – ఎస్ఆర్ కథీర్
ఎడిటర్ – పిలోమిన్ రాజ్
యాక్షన్ కొరియోగ్రఫి – అన్భుఅరివ్
స్టంట్స్- కణల్ కన్నన్
నిర్మాత – సూర్య
సహనిర్మాత – రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్
బ్యానర్ – 2డీ ఎంటర్‌టైన్‌మెంట్