Health Tips:సీజనల్ ఫుడ్స్ లో మొక్కజొన్న ఒకటి వర్షాకాలం వస్తే చాలు మార్కెట్లో ఎక్కడ చూసినా స్వీట్ హవా కాన్ జరుగుతుంది. అయినా మొక్కజొన్న తిని వారు ఎవరు ఉండరు అని చెప్పుకోవాలి. కాల్చిన లేదా ఉడకపెట్టిన టేస్ట్ వేరండోయ్. అందులోనూ వర్షాకాలంలో స్వీట్ కార్న్ అంటే ఇష్టపడిన వారు ఎవ్వరు ఉండరు. కాస్త వేడివేడిగా మొక్కజొన్న కి ఉప్పు కారం నిమ్మకాయ జోడిస్తే ఇంకా చెప్పనక్కర్ల నోట్లో నుంచి లాలాజలం అయితే అందరికీ వస్తుంది అంత అమోఘంగా ఉంటుంది. అయితే మొక్కజొన్న తిన్న తర్వాత నీటిని తాగడం వల్ల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం అధికంగా ఉంటుంది. అసలు ఇంతకీ ఏంటా అని తెలుసుకోవాలని ఉందా ఇంకెందుకు లేట్ చదివేయండి మరి.
మొక్కజొన్న తిన్న తర్వాత నీళ్లు తాగొద్దు ఎందుకంటే మొక్కజొన్నలో పీచు పదార్ధం అధికంగా ఉండడం ద్వారా జీర్ణ వ్యవస్థ పై అధిక ప్రభావం చూపుతుంది అలానే నీరు త్రాగిన వెంటనే విరోచనాలు అధికంగా అయ్యే సూచనలు కూడా ఉన్నాయి.మొక్కజొన్న తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య వచ్చే ప్రభ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. అలానే తలనొప్పి వాంతులు వంటి సూచనలు కూడా కనిపిస్తాయి.మొక్కజొన్న తిన్న 20 నిమిషాల తర్వాత నీళ్లు తాగడం మంచిది. అప్పటికే మొక్కజొన్న జీర్ణమవుతుంది.
అయితే మొక్కజొన్న తినడం ద్వారా లాభాలు కూడా ఉన్నాయి.మొక్కజొన్నలో ఫైబర్ కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. మొక్కజొన్నలో పీచు పదార్థం అధికంగా ఉండటంతో మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. మరియు పెద్దప్రేగు క్యాన్సర్‌ను నివారణకు మొక్కజొన్న చక్కగా పనిచేస్తుంది.