Health శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం లివర్. దీనికి ఏదైనా సమస్య వస్తే ఆ ప్రభావం శరీరం అంతటి మీద పడుతుంది. ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే లివర్ పనితీరు సక్రమంగా ఉండటం ఎంతైనా అవసరం. అయితే కొన్ని లక్షణాలు వుంటే కాలేయ అరోగ్యానికి ఏమైనా సమస్యలు ఉన్నాయేమో చెక్ చేయించుకోవటం మంచిది..
లివర్ కి ఏ మాత్రం హాని జరిగినా దాని ప్రభావం శరీర పనితీరు మీద ఖచ్చితంగా ఉంటుంది. వీటిలో ముఖ్యంగా జీర్ణ క్రియ ప్రభావం అవుతుంది. ఆకలి సరిగ్గా వేయకపోవడం.. తిన్నది అరగకపోవడం వంటి సమస్యలు ఉంటే లివర్ ఆరోగ్యం ఏమైనా దెబ్బతిన్నదేమో తెలుసుకోవాలి. అలాగే విపరీతంగా అలసటగా అనిపించినా.. ప్రతిసారి నీరసం ఎక్కువగా వస్తున్నా.. కాస్త దూరం నడిచేటప్పటికీ కీళ్ల నొప్పులు వచ్చినా లివర్ కు సంబంధించి టెస్ట్ చేయించుకోవడం మంచిది..
తరచూ డిప్రెషన్ వేధిస్తున్న.. అధికంగా తలనొప్పి వస్తున్నా కూడా ఒకసారి లివర్ చెకప్ చేయించుకోవడం మంచిది. తరచూ బయట ఆహారం తీసుకునే వాళ్ళలో లివర్ పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. వీళ్ళలో కామెర్లు వచ్చే సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. కామెర్లు లివర్ కు సంబంధించిన అతి పెద్ద ఆరోగ్య సమస్య. వీటి విషయంలో జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా అవసరం. అందుకే ఇలాంటి ఏ సమస్యలు వచ్చినా లివర్ కు సంబంధించిన బిల్ రూబిన్ టెస్ట్ చేయించుకొని డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది..