Movie తన అందం, అభినయంతో తమిళ ప్రేక్షకుల్ని అలరించిన యువ నటి దీప అలియాస్ పౌలిస్ గత శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలో ఓ ప్రైవేట్ ఫ్లాట్లో అద్దెకు ఉంటున్న దీపకు శనివారం ఎన్నిసార్లు ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి చూడగా.. ఫ్యాన్ కు ఉరేసుకొని కనిపించింది. అయితే అప్పటికే ఆమె చనిపోయి ఉంది. ఆత్మహత్యకు గల కారణాలు పూర్తిగా తెలియనప్పటికీ ఆమె కేసు మరో మలుపు తిరిగింది.
దీప చనిపోయిన ప్లేస్ లో ఒక లెటర్ దొరికిందని.. అందులో తన చావుకి ఎవరూ కారణం కాదని రాసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తను ఎంతవరకు నిజం అనేది తెలియలేదు. తనకు సినిమా అవకాశాలు రావడం లేదని ఆత్మహత్య చేసుకుందని కొందరు అంటుండగా.. లేదు ఇదంతటికీ తన ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన ప్రేమ విషయమై జరిగిన గొడవలతో ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆమె సోదరుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన పోలీసులకు ఆమె ఐఫోన్ తో సహా కొన్ని విలువైన వస్తువులు కనిపించకుండా పోయాయి. అయితే ఇవన్నీ ఏమయ్యాయి అనే విషయం ఇంకా తెలియలేదు.
ఐఫోన్ దొరికితే అసలు విషయం ఏమిటనేది బయటపడే అవకాశం ఉంది. అసలు ఏం జరిగింది? ఆమె చనిపోయే అంత నిర్ణయం ఎందుకు తీసుకుంది? చివరగా ఎవరితో మాట్లాడింది? అనే విషయాలు తెలియాలి అంటే ఆమె ఐఫోన్ దొరకాల్సి ఉంది.. ఈ విషయంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న దీప బాయ్ ఫ్రెండ్ సిరాజ్ ను పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తుంది.