Movie చిరు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూసిన ‘గాడ్ ఫాదర్’ మూవీ నుంచి తొలి పాట వచ్చేసింది. ‘తార్ మార్ తక్కర్ మార్’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాట శ్రోతలను ఉర్రూతలూగించేలా ఉంది.
మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌లపై చిత్రీకరించిన ఈ పాట చూసి అభిమానులు ఊర్రుతలగుతున్నారు.. తార్ మార్ టక్కర్ మార్ అని సాగే ఈ పాట లిరిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సంగీతాన్ని అందించారు.. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
ఈ సినిమా లో పక్క పొలిటికల్ పాత్రలో కనిపించనున్నారు చిరు. రాష్ట్ర రాజకీయాల్ని ఏకచక్రంగా శాసించే వ్యక్తి వెనుక ఉండి నడిపించే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు చిరంజీవి. అయితే ఈ సినిమాకి సంబంధించిన డైలాగుని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మలయాళ చిత్రం లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5 న విడుదల కానుంది.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇందులో నయనతార చిరంజీవికి చెల్లిగా కనిపించనుంది. మరో ప్రధాన పాత్రలో సత్యదేవ్ నటించారు.