Teja Sazza, Priya Prakash Warrier ishq Movie Trailer Launched by Supreme Hero Sai Teja,
సుప్రీమ్ హీరో సాయితేజ్ ఆవిష్కరించిన తేజ సజ్జ, ప్రియా వారియర్, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ ‘ఇష్క్` ట్రైలర్..
దక్షినాదిలోని ప్రతిష్ఠాత్మక బ్యానర్లలో ఒకటైన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ కొంత కాలం విరామం తర్వాత మళ్లీ తెలుగులో వరుసగా చిత్రాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగా ఇటీవల ‘జాంబీ రెడ్డి’ మూవీతో సూపర్ హిట్ సాధించిన యంగ్ హీరో తేజ సజ్జాతో ‘ఇష్క్` అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంతో యస్.యస్. రాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆర్.బి. చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 23న గ్రాండ్‌గా విడుదలవుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను ఈరోజు సుప్రీమ్ హీరో సాయి తేజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో…
ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ మాట్లాడుతూ – “తేజ యంగ్ అండ్ డైనమిక్ హీరోలా కనిపిస్తున్నాడు. ‘జాంబీరెడ్డి` వంటి మంచి సినిమా తర్వాత మెగా సూపర్‌గుడ్‌ఫిలింస్ సంస్థ వంటి మంచి బ్యానర్‌లో తేజ సజ్జా చేసిన ఇష్క్ సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను“ అన్నారు.
హీరో తేజ సజ్జా మాట్లాడుతూ – ‘‘మా ట్రైలర్‌ను విడుదల చేసిన హీరో సాయితేజ్ గారికి ధన్యవాదాలు. అలాగే ‘ఇష్క్’ టైటిల్‌తో నితిన్‌గారి సినిమా ఉంది. మీ సినిమా టైటిల్ ఉపయోగించుకుంటున్నాము అనగానే నితిన్‌గారు సరే అనడమే కాకుండా…మా సినిమాలోని ‘ఆనందం…’సాంగ్ కూడా ఆయన రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నితిన్‌గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఏప్రిల్ 23న మా ‘ఇష్క్’ సినిమా థియేటర్స్‌లో వస్తుంది. ఇది ఒక కొత్త రకం కథ. ‘జాంబీరెడ్డి’ వంటి డిఫరెంట్ జానర్ తర్వాత నేను చేసిన సినిమా ‘ఇష్క్’. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఆడియన్స్‌కు న్యూ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. కొంత గ్యాప్ తర్వాత వస్తున్న మెగాసూపర్‌గుడ్ ఫిలింస్ వారు ఫస్ట్ సినిమా నాతో చేయడం సంతోషంగా ఉంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలనే ఈ సంస్థ వారు ప్రొత్సహిస్తుంటారు. ‘ఇష్క్’ సినిమాలో కూడా మంచి కంటెంట్ ఉంది. తప్పకుండా ఆడియన్స్‌కి నచ్చే చిత్రమిది“ అన్నారు.
తారాగణం:
తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్, తమిళ నటుడు రవీందర్
సాంకేతిక బృందం:
డైరెక్టర్: యస్.యస్. రాజు
నిర్మాతలు: ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్
సమర్పణ: ఆర్.బి. చౌదరి
బ్యానర్: మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్
మ్యూజిక్: మహతి స్వరసాగర్
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు
ఎడిటింగ్: ఎ. వరప్రసాద్
ఆర్ట్: విఠల్ కొసనం
లిరిక్స్: శ్రీమణి
పీఆర్వో: వంశీ-శేఖర్.