హైదారాబాద్ రవీంద్రభారతిలో ఆదివారం జరిగిన తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ TDF-USA 6వ ప్రవాసి తెలంగాణ దివస్ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. విశేష అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధిలో NRI ల పాత్రపై విస్మరించ లేనిదన్నారు. సుదూర దేశంలో ఉన్నప్పటికీ, తమ సొంత ఊర్ల ను మరచిపోని తెలంగాణ బిడ్డలని మంత్రి చెప్పారు. ఉద్యమ సమయంలో tdf ని ఏర్పాటు చేసి ఉద్యమం కి కీలకంగా పని చేశారని, మరికొందరు, ఉద్యమంలో ఇక్కడ భాగస్వాములు అయ్యారని అన్నారు. అలాంటి బిడ్డలకు ఇక్కడ సీఎం కెసీఆర్ అనేక అవకాశాలు కల్పించారని మంత్రి తెలిపారు. తెలంగాణ సమస్యలను చర్చించడానికి USA లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ ని స్థాపించడం గొప్ప ప్రయత్నం. TDF తెలంగాణా గతం, వర్తమానం మరియు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నది. ఇక్కడ తెలంగాణలో జాతీయ స్థాయి లీడర్ షిప్ కాన్ఫరెన్సు నిర్వహించడం చాలా సంతోషం. అని, TDF నిర్వాహకులను అభినందిస్తున్న అన్నారు.
TDF 2008 నుంచి తెలంగాణలో ప్రవాసీ తెలంగాణ దివస్ ను నిర్వహిస్తోంది. రాష్ట్ర ఏర్పాటుపై తెలంగాణ ఎన్నారైల అభిప్రాయాలను తెలియజేస్తూ శ్రీకృష్ణ కమిటీకి నివేదికను సమర్పించిన గొప్ప చరిత్ర మీది. కరోనా సమయంలో తెలంగాణలో వైద్య సహాయక చర్యలను అందించింది. TDF రాష్ట్రంలో ఆశా వర్కర్లకు కరోనా రిలీఫ్ కిట్లతో పాటు 50 కంటే ఎక్కువ ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందించడానికి విస్తృత చర్యలు తీసుకున్నది. గ్రామీణ తెలంగాణ రైతాంగానికి సుస్థిర వ్యవసాయం, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ లపై అవగాహన కల్పించారు. మోడల్ వ్యవసాయ ప్రాజెక్ట్, సహకార సంస్థలను సెటప్ చేయడం, పరిశోధనలు కోసం అదే పనిగా పనిచేస్తున్న మీకు అభినందనలు. అని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.
మన తెలంగాణ బడి- సైన్స్ ల్యాబ్లు, స్మార్ట్ క్లాసు రూములు, ఫిల్టర్డ్ వాటర్ ప్లాంట్లు అందించడం ద్వారా గ్రామీణ పాఠశాలల్లో బోధన నాణ్యతను మెరుగుపరచడానికి మీరు చేస్తున్న కృషి అనన్య సామాన్యం. జోగులాంబ-గద్వాల్ జిల్లాలోని పాఠశాలల్లో విజయవంతంగా అమలు చేసిన ఈ ప్రాజెక్ట్ ను తెలంగాణ రాష్ట్రం అంతతా విస్తరించి అమలు చేయాలని ఆశిస్తున్నాను. ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్ షిప్పులను ఇవ్వడం ద్వారా వారి ఆత్మ స్థైర్యాన్ని పెంపోదిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు సహాయం చేయడంతో పాటు, పిల్లల ఆకలి నివారణ, అనాథల కు సహాయం చేయడం హర్షించదగిన విషయం.మీ అందరినీ పేరు పేరునా అభినందిస్తున్నాను. అని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
తెలంగాణలో సీఎం కెసిఆర్ అమలు చేస్తున్న పథకాలు మీరు చూస్తున్నారు. చరిత్రలో నిలిచిపోయే పథకాలను కెసిఆర్ రూపొందించారు. రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కెసిఆర్ కిట్లు, దళిత బంధు, ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయి. సీఎం కెసిఆర్ ముందు చూపు మన రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా తీర్చి దిద్దుతున్నది. ఈ అభివృద్ధికి మీ తోడ్పాటు అవసరం. తెలంగాణ బిడ్డలుగా మీ సొంత ఊర్ల ను దత్తత తీసుకోండి మీ ఔదార్యాన్ని చాటు కోండి. విద్య, వైద్య రంగాలలో మౌలిక సదుపాయాల కల్పనలో తోడ్పడండి. మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టి మీ కన్న తల్లి, మి సొంత ఊరు రుణం తీర్చుకోండి. అంటూ NRI లకు ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరామ్ గారు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, సభా అధ్యక్షులుగా శ్రీమతి కవిత చల్ల గారు, TDF- USA అధ్యక్షురాలు శ్రీమతి ప్రీతి చల్లా గారు, TDF-USA వైస్ ప్రెసిడెంట్ రాజా రెడ్డి గారు, Tdf india ప్రెసిడెంట్, ప్రతినిధులు, పలువురు ప్రవాస భారతీయులు, ప్రముఖులు పాల్గొన్నారు.