తెలంగాణ హిందీ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ భవన్లో మంగళవారం సాయంత్రం తెలంగాణ హిందీ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం ఎన్ ఎస్ కుమార్, జాయింట్ సెక్రెటరీ సర్వర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ వికాస్ తో పాటు పలువురు జర్నలిస్టు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో హిందీ పత్రికల్లో పనిచేసే జర్నలిస్టుల పాత్ర ఎంతో శ్లాఘనీయం అని మంత్రి కేటీఆర్ కొనియాడారు.