Telangana Journalists Corona Vaccine Special Drive, Telangana I&PR Dept, Sri Arvind Kumar IAS, Dept. of I & PR, TSUWJ,
అక్రిడిటేషన్ కలిగిన తెలంగాణ జర్నలిస్టులందరికి కోవిడ్ వ్యాక్సినేషన్: I&PR Dept Sri Arvind Kumar IAS
రాష్ట్ర వ్యాప్తంగా అక్రిడిటేషన్ కలిగిన తెలంగాణ జర్నలిస్టులందరికి మే 28, 29 తేదీలలో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ అర్వింద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జర్నలిస్టులు సమాచార పౌర సంబంధాల శాఖ జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డు తో పాటు ఆధార్ కార్డును తమ వెంట తీసుకొని వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లాలని ఆయన సూచించారు.
జిల్లాల్లో గుర్తించిన కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల జాబితా సంబంధిత జిల్లా పౌర సంబంధాల అధికారుల దగ్గర అందుబాటులో ఉందని అన్నారు.
రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల కోసం వ్యాక్సినేషన్ కేంద్రాలుగా ప్రెస్ క్లబ్ సోమజిగుడ, ప్రెస్ క్లబ్ బషీర్బాగ్, యం.సి.ఆర్.హెచ్.ఆర్.డి. ఇన్స్టిట్యూట్ జూబ్లీ హిల్స్, యునాని హాస్పిటల్ చార్మినార్ మరియు ఏరియా హాస్పిటల్ వనస్థాలిపురం లను గుర్తించడం జరిగిందని అన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖలో సుమారు 20 వేల మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్ పొందారని, వారిలో 3700 మంది రాష్ట్ర స్థాయి జర్నలిస్టులు ఉన్నారని తెలిపారు. అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులందరూ కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ను ఉపయోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ అర్వింద్ కుమార్ తెలిపారు..
జారీచేసినవారు కమీషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ.