Telangana Legislative Council Chairman Sri Gutha Sukender Reddy Powerful Comments on YS Sharmila New Party
దుర్భుద్ధితో తెలంగాణను దోచుకునేందుకు కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి: తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ఎవరి హయాంలో అయితే హైదరాబాద్ లో అల్లాకొల్లలం సృష్టించి ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సయించారో, వాళ్లే ఇవ్వాళ పార్టీని స్థాపిస్తాం అంటూ నీతి వ్యాఖ్యలు వల్లిస్తున్నారు.
తెలంగాణలో ఉన్న సుస్థిర ప్రభుత్వాన్ని బలహీన పరచేందుకే కొన్ని శక్తులు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
ఆశకు కూడా హద్దు ఉంటుంది.
తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు.రాజకీయ లబ్ది పొందాలని చుస్తే వల్ల పప్పులు ఇక్కడ ఉడకవు.
తెలంగాణ లో గడీల పాలన లేదు. గడిలా పాలన పులివెందుల లో ఉంది.. ప్రజాస్వామ్య యుతంగా తెలంగాణలో పాలన కొనసాగుతున్నది.
కులాల పేరుతో, మతాల పేరుతో , ప్రజలను రెచ్చగొట్టి లబ్ది పొందాలని కొన్ని శక్తులు గోతి కాడి నక్కలగా చూస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త.ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి.
తెలంగాణ ను అస్థిర పరిచే శక్తులకు ఇక్కడ స్థానం లేదు. అవకాశం ఇవ్వకూడదు.