కెసిఆర్ గారు మీడియా అకాడమీకి 7 సంవత్సరాల క్రితం స్వయంగా వచ్చి జర్నలిస్టుల సంక్షేమానికి 100 కోట్ల నిధిని ప్రకటించి, ఇప్పటివరకు 42 కోట్లు నిధులు విడుదల చేశారని, దేశంలోని 29 రాష్ట్రాలలో ఎక్కడా, ఏ ప్రభుత్వం ఇంత చొరవ చూపి జర్నలిస్టుల గురించి ఆలోచించలేదన్నారు. మీడియా అకాడమీ ప్రభుత్వం విడుదల చేసిన 42 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చిన వడ్డీతో జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నదని, ఇప్పటివరకు 16 కోట్లు జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు అకాడమీ సహాయం అందజేసిందని, జర్నలిస్టుల సంక్షేమ నిధి వల్ల 490 మంది మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం, ఐదు సంవత్సరాలపాటు,వారి భార్యకు 3000 రూపాయలు నెలవారి పెన్షన్, మరణించిన జర్నలిస్ట్ ల పిల్లల కు ఎల్ కె జి నుండి పదవ తరగతి వరకు కు చదువుకోవటానికి ప్రతి నెల వెయ్యి రూపాయలు ట్యూషన్ ఫీజు అకాడమీ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదాల వలన ఇతర దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న 122 మంది జర్నలిస్టులకు 50000 ఆర్థిక సాయం అందజేసినట్టు గా తెలిపారు. కరోనా సమయంలో వార్తలు సేకరణ లో కోవిడ్ బారిన పడ్డ 4000 జర్నలిస్టులకు, కొందరికి 10000, మరికొందరికి 20000 ఆర్థిక సాయం జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి అంద చేసినట్లు చైర్మెన్ అల్లం నారాయణ తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వైద్య సదుపాయం కల్పించడానికి హెల్త్ కార్డు ను ప్రభుత్వం జర్నలిస్టులకు అందజేసిందని, ఆ సదుపాయం పటిష్టంగా అమలు పరిచేందుకు కు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. ఎడిటర్ స్థాయి గొప్ప అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్ లు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటారని, కనుక శిక్షణా తరగతులలో అనుభవం ఉన్న జర్నలిస్టులు తెలిపే అనేక విషయాలను విలేకరులు నేర్చుకోవాలని, కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఎం ఎల్ ఏ లు తమ నియోజకవర్గంలో పనిచేసే జర్నలిస్టులకు కట్టుకోవడానికి స్థలం లేదా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించేందుకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, శ్రీనివాస్ యాదవ్ వారి నియోజకవర్గంలో పనిచేసే జర్నలిస్టులకు ఇండ్లు ఇస్తున్నారని, వరంగల్ లోని ఈస్ట్, వెస్ట్ ప్రాంతాలలో కూడా ఇండ్లు కేటాయించే ప్రయత్నం జరుగుతుందని అన్నారు.
రాష్ట్రంలో 9 జిల్లాలలో జర్నలిస్టుల శిక్షణా తరగతులు నిర్వహించామని, దాదాపు 6000 మంది విలేకరులు వీటి ద్వారా తమ వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరచుకున్నారని తెలిపారు. ఇటీవల అకాడమీ నిర్వహించిన దళిత జర్నలిస్టుల శిక్షణా తరగతులు, మహిళా జర్నలిస్టుల శిక్షణా తరగతులు గొప్పగా విజయవంతమయ్యాయని అని అల్లం నారాయణ తెలిపారు. జర్నలిస్టుల వృత్తి నైపుణ్యానికి ఉపయోగపడే 12 పుస్తకాలు మీడియా అకాడమీ ప్రచురించి శిక్షణ తరగతులలో ఒక కిట్ ను జర్నలిస్టులకు అకాడమీ అందజేస్తుందని, మీడియా అకాడమీ సొంత భవనం నిర్మాణం పూర్తి కావస్తున్నదని తెలిపారు.
తెలంగాణ మీడియా అకాడమీ జర్నలిస్టుల శిక్షణ తరగతులు తన నియోజకవర్గం నిర్వహించడం చాలా సంతోషం కలిగించిందని, ముషీరాబాద్ నియోజకవర్గంలో పనిచేసే జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించేందుకు తన పూర్తి సహకారం ఉంటుందని శాసనసభ్యులు ముఠా గోపాల్ అన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని, ఆర్టీసీ కళ్యాణ మండపంలో మీడియా అకాడమీ నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తన నియోజకవర్గంలో పదిమందికి దళిత బంధు పథకం ద్వారా సహాయం అందించినట్లు ఈ సందర్బంగా తెలిపారు. ఇన్ఫినిటీ పథకం కింద పేదవారు ఉన్నచోటనే ఇండ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తున్నదని ఈ పథకాన్ని జర్నలిస్టులు కూడా ఉపయోగించుకోవాలని అన్నారు. కరోనా సమయంలో జర్నలిస్టు వార్తల కవరేజి కి ఎంతో కృషి చేయడం తాను ప్రత్యక్షంగా చూశానని, జర్నలిస్టుల పిల్లల విద్య మరి ఏ ఇతర సహాయానికైనా తాను సర్వదా అందుబాటులో ఉంటానని తెలిపారు.
అకాడమీ 9 ఉమ్మడి జిల్లాలలో జరిపిన జర్నలిస్టుల శిక్షణా తరగతులు దళిత జర్నలిస్టుల శిక్షణ తరగతులు మహిళా జర్నలిస్టుల శిక్షణ తరగతులు దిగ్విజయంగా జరిగాయని జర్నలిస్టు లు నిత్యం విద్యార్థులుగా ఉండి శిక్షణా తరగతులలో అనుభవజ్ఞులు చెప్పే విషయాలను ఆకలింపు చేసుకోవాలని టీ యు డబ్ల్యూ జె జనరల్ సెక్రెటరీ మారుతి సాగర్ అన్నారు. కార్యక్రమం లో అకాడమీ సెక్రటరీ నాగులపల్లి వెంకటేశ్వర రావు , ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు ఇస్మైల్ , హైదరాబాద్ జిల్లా జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు యోగానంద్, కార్యదర్శి నవీన్ కుమార్ , ప్రోగ్రెసివ్ జర్నల్ లిస్టు అస్ షియూన్ ఆఫ్ ఇండియా. నక్క మల్లికార్జున , పాల్గొన్నారు.