తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శ్రీ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి గారు, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., గారు., హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ నిర్వహిస్తున్న 1st NTPC నేషనల్ ర్యాంకింగ్ ఆర్చరీ టౌర్నమెంట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సబ్ జూనియర్ విభాగంలో విజేతలకు బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రెటరీ జనరల్ శ్రీ ప్రమోద్ చందుర్కార్, తెలంగాణ అర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ అనిల్ కామినేని, కార్యదర్శి శ్రీ ఈగ సంజీవ రెడ్డి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఇన్ చార్జి ప్రెసిడెంట్ వేణుగోపాలచారి, కార్యదర్శి జగదీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఇన్ చార్జి ప్రెసిడెంట్ శ్రీ వేణుగోపాలచారి, కార్యదర్శి శ్రీ జగదీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.