థియేటర్‌లో విడుదలయ్యే భారీ సినిమాలు ఇకపై అంత త్వరగా ఓటీటీలోకి రావు. భారీ బడ్జెట్ సినిమాలు 10 వారాల తర్వాతే ఓటీటీలో వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు పరిమిత బడ్జెట్‌తో రిలీజ్ అయిన సినిమాలు 4 వారాల తర్వాత ఓటీటీలోకి రానున్నాయి. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు టికెట్ ధరలు కూడా సాధారణ థియేటర్లు, సి క్లాస్‌లో రూ.70-రూ.100 వరకు ఉంచాలని.. మల్టీప్లెక్స్‌లో జీఎస్టీతో కలిపి రూ.125-రూ.150 ఉండేలా ప్రతిపాదనలు చేశారు. వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.