Viral Video మోసం పెద్ద పెద్ద మోసాలే కాదు ఒకసారి చిన్న మోసాలు కూడా మనసులో ఎంతో కలచివేస్తాయి.. తాము నమ్మిన సెలబ్రిటీలు కానీ యూట్యూబర్స్ కానీ ఇలా చేస్తే వారి ఫాలోవర్స్ ఎంతో బాధపడతారు అలాంటిది వారి దగ్గర నుంచి కొన్ని కోట్లు కొల్లగొట్టి విదేశాలకు వెళ్ళిపోతే వారు బాధ ఇంకా ఎంత వర్ణనతీతంగా ఉంటుంది ఊహించలేము.. ఇలాంటి సంఘటన ఒకటి థాయిలాండ్ లో జరిగింది.
యూట్యూబ్లో ఒక్కసారిగా ట్రెండ్ అయిన నత్తి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పర్చుకొని దాదాపు 8 లక్షల 50 వేల మంది సబ్స్క్రయిబర్స్ ను ఆకర్షించింది.. ఇలానే వాళ్ళందరి దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి విదేశాలకు చెక్కేసింది.
యూట్యూబ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్న ఈమె తన ఫాలోవర్స్ ను మోసం చేసింది.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 437 కోట్లతో మలేషియాకు చెక్కేసింది.. అసలు విషయం ఏంటంటే కొన్ని రోజుల క్రితం నత్తి డైరీ పేరుతో తన యూట్యూబ్ అకౌంట్లో ఒక వీడియో పోస్ట్ చేసిన ఈ భామ.. తన దగ్గర ఉన్న లగ్జరీ కార్లను సోషల్ మీడియాలో చూపిస్తూ ఉండేది. తను ఎటువంటి లగ్జరీ కార్లు కొన్న అవన్నీ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉండేది. ఐక్యూ ఆప్షన్ అనే బ్రోకర్ ద్వారా వీటిని పొందినట్టు తెలుస్తుంది. అయితే ఇవన్నీ తన సొంతమని చెప్పి ఫాలోవర్ని విపరీతంగా ఆకర్షించింది.. వీరందరి నుంచి దాదాపు 18 మిలియన్ల భాట్ డిపాజిట్ చేయించుకున్నట్టు తెలుస్తుంది..
అంతా నిజమని నమ్మిన ఫాలోవర్స్ విపరీతంగా పెట్టుబడులు పెట్టారు వారందరినీ ఆమెను నట్టేట ముంచేసి వెళ్లిపోయింది.