యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా, వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘సామజవరగమన’. అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్ పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఫన్ టాస్టిక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.
సక్సెస్ మీట్ లో డైరెక్టర్ మెహర్ రమేష్ మాట్లాడుతూ.. అనిల్ సుంకర గారు పాజిటివిటీ కి ప్యాషన్ కి మారుపేరు. ఆయనకు హిట్ రావాలని ఇండస్ట్రీ అంతా కోరుకున్నమాట నిజం. శ్రీవిష్ణు లో ప్యాషన్ చూస్తుంటే రవితేజ గుర్తుకు వస్తున్నారు. శ్రీవిష్ణు కు మరిన్ని విజయాలు రావాలి. ఈ సినిమా ట్రైలర్ ని అన్నయ్య చిరంజీవి గారు లాంచ్ చేశారు. భోళా శంకర్ షూట్లో బిజీగా ఉన్నప్పటికీ ప్రత్యేకంగా సమయం తీసుకొని మంచి మనసుతో అన్నయ్య ట్రైలర్ లాంచ్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది. దర్శకుడు రామ్ కు అభినందనలు.
భాను నందు ఇలా టీం అంతా కలసి మ్యాజిక్ క్రియేట్ చేశారు. ప్రేక్షకులు సినిమాని ఇంతలా ఆదరిస్తున్నారంటే దీనికి కారణం టీం సమిష్టి కృషి. నరేష్ గారు జంధ్యాల, ఈవీవీ గారి సినిమాలతో అందరినీ అలరించారు. ఇప్పుడు ‘సామజవరగమన’ చిత్రాన్ని జంద్యాల, ఈవీవీ సినిమాలతో పోలుస్తూ మాట్లాడటం, ఇందులో నరేష్ గారు ఉండటం ఆనందంగా వుంది. రాజేష్ గారు మంచి స్పీడ్ వున్న నిర్మాత. స్పీడ్ గా మరిన్ని సినిమాలు తీయాలి. ఇది తెలుగు చిత్ర పరిశ్రమ విజయం. అనిల్ గారు జులై నుంచి ఇండస్ట్రీని సక్సెస్ నోట్ లోకి తీసుకెళ్ళారు. మెగాస్టార్ భోళా శంకర్ తో సక్సెస్ ని ఖచ్చితంగా కొనసాగిస్తాం’’ అన్నారు.